ఒక వైపు ఢిల్లీ ఏపి భవన్ లో చంద్రబాబు దీక్ష చేసి, 22 పార్టీల మద్దతుతో, మోడీకి చుక్కలు చూపిస్తుంటే, పార్లమెంట్ లోపల కుర్ర ఎంపీ హీట్ పెంచుతున్నారు. కేంద్రం ఏపీకి తీరని ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం తీవ్ర జాప్యం చేసిందన్నారు. ఏపీ సమస్యలపై, నిన్న గుంటూరులో ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఆయన పార్లమెంట్‌లో ప్రస్తావించారు. రైల్వేజోన్ హామీని కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క మీటింగ్ పెట్టలేదని ఆయన విమర్శించారు. ఏపీలో వెనుకబడిన జిల్లాల కోసం రూ. 350 కోట్లు అకౌంట్‌లో వేసి... ఆ తర్వాత రాజకీయ కక్షతో కేంద్రం వెనక్కి తీసుకుందని రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. ఇంతటి దారుణం ఎప్పడూ జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను విమర్శిస్తున్నారని మోదీ అనడం దారుణమని రామ్మోహన్‌నాయుడు అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని, ఆయన ఎప్పుడూ ఏపీ కోసమే మాట్లాడారన్నారు. ఏపీకి చేయాల్సిన సాయం కేంద్రం చేసి ఉంటే.. తాము మాట్లాడాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఇలా ధర్మపోరాట దీక్షల వరకు వచ్చేది కాదన్నారు.

ramu 11022019

'ఏపీకి తీరని ద్రోహం చేశారు. వెనుకబడిన జిల్లాలకు డబ్బులిచ్చి వెనక్కి తీసుకున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి కేవలం రూ.1.500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆ డబ్బులతో ఏ రాజధాని కట్టొచ్చో చెబితే మేం సంతోషిస్తాం. ఇదేం తీరు. ఇదేం పద్ధతి' అంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ కోసం చంద్రబాబు మాట్లాడితే, దానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం దారణమని, అసలు చేయాల్సిన సాయం చేస్తే 'ధర్మపోరాటం' వరకూ ఎందుకు వెళ్తాం? అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై లోక్‌సభలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ, రాజకీయ కక్షతోనే ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి తీసుకున్న ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుందంటూ నిప్పులు చెరిగారు.

ramu 11022019

'నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు. రైల్వే జోన్ ఇస్తామన్నారు. ఆ ఊసే లేదు. దీనికోసం కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు అకౌంట్లో వేసి...ఆ తర్వాత వెనక్కి తీసేసుకున్నారు. ఇంతకంటే దారణం ఏమైనా ఉంటుందా?' అని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని కోసం కేంద్రం కేవలం రూ.1,500 కోట్లు ఇచ్చి చేతులెత్తేసింది. ఆ డబ్బులతో ఎలాంటి రాజధాని కట్టాలి? పటేల్ విగ్రహానికి వేల కోట్లు ఇచ్చి, అమరావతిని పట్టించుకోరా?. మా చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతోనే రైతులు 35వేల ఎకరాలు రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. అది మా నాయకుడి స్థాయి...అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీకి కేంద్రం సహకరించకపోయినా, సాయం చేయకపోయినా చంద్రబాబు రాష్ట్రం కోసం అహరహం శ్రమిస్తున్నారని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చంద్రబాబు మాట్లాడుతూంటే ఆయనపై మోదీ వ్యక్తిగత విమర్శలు గుప్పించడంలో అర్ధం ఏమిటని నిలదీశారు. ఏపీకి జరిగిన అన్యాయంపైనే చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు దిగారని అన్నారు. 'మా ఆవేదన చెబుతాం. మాకు జరిగిన అన్యాయంపై నిలదీస్తూనే ఉంటా' అని ఆయన కుండబద్ధలు కొట్టారు.

 

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read