జగనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కేసులో, కోర్ట్ కు తీసుకువెళ్లగానే, కొత్త ట్విస్ట్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో పోలీస్ స్టేషన్ ను, రాపాక ముట్టడించారని, ఆయన పై నాన్ బైలబుల్ కేసులు పెట్టారు. దీంతో ఆయాన ఈ రోజు రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అయితే ఈ సందర్భంగా, రాపాకను కస్టడీకి విధించాలని, రాజోలు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు రాపకను హాజరుపరిచారు. అయితే ఈ సందర్భంలో, పోలీసులకు అనుకోని ట్విస్ట్ ఇచ్చింది కోర్ట్. రాపాకను కొన్నాళ్ళు జైల్లో ఉంచాలనే ప్రభుత్వ పెద్దల ప్లాన్ బెడిసికొట్టింది. రాపాకను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే విధానం ఇది కాదని పోలీసులను కోర్ట్ మందలించింది. విజయవాడ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పోలీసులకు సూచించారు.

rapaka 13082019 2

కోర్ట్ లో పోలీసులకు క్కెదురు కావడంతో రాపాకను స్టేషన్ కు తీసుకొచ్చి, స్టేషన్ బెయిల్ ఇస్తామని పోలీసులు కోర్ట్ కి చెప్పారు. దీంతో రాపాకను స్టేషన్ బెయిల్ పై విడిచి పెట్టారు. రాపాకను అరెస్ట్ చేసి లోపల వేసి, వేధించవచ్చు అనే ప్లాన్ మాత్రం ప్రభుత్వ పెద్దలకు బెడిసి కొట్టింది. అయితే అంతకు ముందు, మలికిపురం పోలీస్ స్టేషన్ ను తన అనుచరలుతో కలిసి, ముట్టడించిన కేసులో పోలీసులు రాపాక వరప్రసాద్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ను జారీ చేసారు. రాపాకతో పాటు ఆయన అనుచరులు అయిన 30 మంది జనసేన కార్యకర్తల పై సెక్షన్‌ 143,147,148,341,427 r/w 149 ఐపీసీ, 7 సీఎల్ఏ - 1932, 3పీడీపీపీఏ సెక్షన్ల కింద రాజోలు పోలీసులు కేసు నమోదు చేసారు. దీంతో రాపాక అరెస్ట్ ఖాయం కావటంతో, ఆయనే వచ్చి లొంగిపోయారు.

rapaka 13082019 3

దీని పై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇంత చిన్న కేసు విషయంలో, ఇలా ఎందుకు చేస్తున్నారో, అని పవన్ కళ్యాణ్ అన్నారు. గోరుతో పోయే దాన్ని, గొడ్డలి దాక తెస్తున్నారని అన్నారు. పరిస్థితి చేయి దాటితే, నేను కూడా అక్కడకు వచ్చి కూర్చుంటాను అని అన్నారు. అయితే ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యేల పై కక్ష తీర్చుకుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక పక్క నిన్న, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఒక పత్రికాధినేత పై దాడి చేసి, చంపేస్తాను అని బెదిరిస్తే, ఆయన కేసు పెడితే, ఇప్పటి వరకు పోలీసులు ఆ ఎమ్మెల్యేను విచారణకు పిలవలేదు. అలాంటిది, ఇంత చిన్న విషయంలో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read