వైసీపీ నేత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. వారం రోజుల క్రితమే, గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దీంతో ఈ రోజు అమలాపురం వచ్చిన ఆయన మీడియా సమావేశం పెట్టారు. కోనసీమలోని ఒక మండంలో వైసిపీ యువనేతల ఏర్పాటు చేసిన అభినందనల కార్యక్రమానికి పండుల రవీంద్ర బాబు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా, ఆయన తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేసారు. మా ముఖ్యమంత్రి జగన్ ను, జడ్జీలు కానీ, చంద్రబాబు కానీ, కేసులు కనీ ఏమి వెంట్రుక కూడా కదపలేరు అంటూ, చేతి మీద వెంట్రుక పీకి హావభావాలు చూపించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు కూడా అవాక్కయ్యారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై ఉన్నారని, అలాంటిది కేసులు, జడ్జీలు ఏమి పీకలేరు అని చెప్పటం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

పదవి వచ్చిన ఆనందంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అది జగన్ కే చివరకు ఇబ్బంది అవుతుందని, కొంచెం కంట్రోల్ లో మాట్లాడాలని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు వరకు అయితే, రాజకీయ ఆరోపణలు అనుకోవచ్చని, కానీ ఈయన ఏకంగా జడ్జీలు, కేసులు ఏమి పీకలేరు అంటూ, చేతి మీద వెంట్రుకలు పీకి చూపించటం, జుబుక్సాకరం అని, ఆయన ఇబ్బందుల్లో పడటమే కాకుండా, జగన్ ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టుతారని వాపోతున్నారు. ఇప్పటికే వైసిపీ నేతలు, కోర్టులు పై, జడ్జీల పై ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆరోపణలతో, వారి పై హైకోర్టు, గత వారం సుప్రీం కోర్టు కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే జడ్జీలను ఇష్టం వచ్చినట్టు తిడుతున్న వైసీపీ నాయకులు, పేటీయం బ్యాచ్ పై, కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. దీని పై త్వరలోనే తీవ్ర చర్యలు కూడా తీసుకునే అవకాసం ఉంది. ఈ తరుణంలో, ఇప్పుడు ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు, జడ్జీలు తమ అధినేతను ఏమి పీకలేరు అని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. పూర్తీ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/ECC5j1tU9sQ

Advertisements

Advertisements

Latest Articles

Most Read