తెలంగాణలో ఉన్న ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్ కి, కేసుల కోసం కేంద్రానికి భయపడి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించటం చేతకాని వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడిని విమర్శించటం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ మండిపడ్డారు. శుక్రవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాయలసీమకు చంద్రబాబు ఏదో అన్యాయం చేసినట్టుగా వైసీపీ నేత గడికొట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్సదం. పాడిండే పాటరా పాసుపల్ల దాసుగా అన్నట్టు గడిగోట శ్రీకాంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు. రాయలసీమ రైతుల మభ్యబెట్టేలా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ను స్వాగతించిన వైసీపీ ఇప్పుడు దాంట్లో వెలుగొండ లేదు, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులు లేవనటం హాస్యాస్సదం. ఒక్క ఎకరాకు నీళ్లు కావాలన్నా కేంద్రం దగ్గరకు వెళ్లి అడగాల్సిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వానిది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ నీటిని వాడుకుంటుంటే కేసీఆర్ ని ప్రశ్నించటం చేతకాక జగన్ రెడ్డి చేతులెత్తేశారు. ఇద్దరు ముఖ్యంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే రెండు రాష్ట్రాల నీటి సమస్యలు పరిష్కారమవుతాయని జగన్ సోదరి షర్మిల చెబుతోంది. కనీసం దానిపై అయినా జగన్ రెడ్డి దృష్టి పెట్టకుండా వైసీపీ నేతలు చంద్రబాబుని విమర్శించటం సిగ్గుచేటు. నాడు 798 అడుగులకే నీళ్లు ఉంటే మచ్చుమర్రికి వాడుకునే అవకాశం చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. కానీ నేడు 800 అడుగులున్నా తెలంగాణ విద్యుత్ అవసరాలకు వాడుకుంటుంటే నోరుమెదపలేని స్థితిలో మన ముఖ్యమంత్రి ఉండటం బాధాకరం. రాయసీమకు టీడీపీ ఏం చేసిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. తెలుగు గంగ, గాలేరి నగరి ప్రాజెక్టులు ఎవరి హయాంలో వచ్చాయి? గండికోట రిజర్వాయర్ ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చింది ఎవరు? గండికోట నిర్వాసితులకు న్యాయం చేయలేనని జగనే ఒప్పుకున్నారు. దానిపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు వ్యవసాయం దండగన్నారని ఎక్కడన్నారో నిరూపించాలి. పోలవరం 70 శాతం, పట్టిసీమ కట్టింది చంద్రబాబు రైతులకు కోసం కాదా? పట్టిసీమలో అవినీతి జరిగిందని ప్రచారం చేసిన వైసీపీ నేతలు అదే పట్టిసీమ కాంట్రాక్టు సంస్ధ మెగా ఇంజనీరింగ్ కే పోలవరం పనులు అప్పగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోలవరానికి రూ. 56 వేల కోట్లకు డీపీఆర్ ఆమోదించామని ఇద్దరు కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కానీ ఇప్పుడు మీచేతకానితనం చూసి పోలవరానికి 20 వేల కోట్లకంటే ఎక్కువ ఇవ్వలేమని చెబుతోంది. మీరు రైతులకు ఏం న్యాయం చేస్తారు? పోతిరెడ్డి పాడు రెగ్యురేటర్ వెడల్పు చేస్తున్నామని చెబుతున్నారు, జగన్, కేసీఆర్ కలిసి తమ స్వార్ద ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగునీటి రంగానికి ఒక్క రూపాయి అయినా అదనంగా ఖర్చు పెట్టారా?

ఒక ఎకరాకైనా అదనంగా నీరిచ్చారా? మీ చేతకానితనం చూసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం చేసేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ముఖ్యమంత్రి మాత్రం లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాటి ప్రధాని వాజ్ పేయ్ ని, కేంద్రమంత్రులను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ కి రూ. 1800 కోట్లు తెచ్చారు. విభజన చట్టంలో ఉన్న పోలవరాన్ని సాధించుకోలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ్. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం కట్టిన అప్లికేషన్ పీజులు, కాలేజీ, యూనివర్సిటిలకు విధ్యార్ధులు కట్టిన పీజు డబ్బులతో విద్యాదీవెన ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేలు. పోలవరం నిర్వాసితులకు రూ. 10 లక్షలు ఇస్త్తామని చెప్పారు. గోదావరికి వదరలు వస్తే ముంపు ప్రాంతాల్లో ప్రజలు కొండలపై గుడారాలు వేసుకునే పరిస్థితి కల్పించారు. మీరు నిర్వాసితుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. మచ్చుమర్రి ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు కి పేరు వస్తుందని పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో పోలవరంలో జరిగిన 70 శాతం పనులు తప్ప వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్లలో ఒక్క శాతం కూడా పనిచేయలేదు. నదుల అనుసందానానికి చంద్రబాబు ప్రణాళిక రూపొందిస్తే ...జగన్ దాన్ని ఒక్క అడుకు కూడా ముందుకెయ్యలేదు. వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ప్రకాశం జిల్లాకు ఏం న్యాయం చేశారు? గెజిట్ ముందు స్వాగతించి, ఇప్పుడు ఈ పెడబొబ్బలు ఎవరిని మోసం చేయటానికి గెజిట్ పై వైసీపీకి అసలు స్టాండ్ ఉందా? జగన్ ఏం ముఖ్యమంత్రి జగన్ ఒక విజన్ ఉందా? రాష్ర్ట భవిష్యత్తు పట్ల ముందు చూపులేని నాయకుడు జగన్ రెడ్డి. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసింది శూన్యం. ఎంతమందిని తప్పుడు కేసులతో జైళ్లో పెట్టినా న్యాయం ముందు నిలబడవు. మీ చేతకానిపాలన ప్రజలకు అర్ధమైంది. అన్ని వ్యవస్ధల్ని కుప్పకూల్చారు, అభివృద్ది లేదు, టీడీప హయాంలో రూ. 10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఊరురు తిరిగి అబ్బదపు ప్రచారాలు చేశారు. రెండేళ్ల పాలనలో ఒక్క రూపాయి అవినీతిని నిరూపించలేకపోయారు. ఈ 2 ఏళ్లలో కేంద్రం నుంచి కొత్తగా ఒక్క ప్రాజెక్టు తెచ్చారా? విజభన చట్టంలో ఉన్న హామీలను ఒక్కటైనా సాధించారా ? కాకినాడ పెట్రో కెమికల్ పై చేతులెత్తేశారు, విశాఖ రైల్వేజోన్ ను వదిలేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం అవుతున్నా నోరు మెదపకుండా 7 వేల ఎకరాలకు అమ్ముకునేందుక పోస్కోతో ఒప్పందం చేసుకున్నారు. మీ పాలనలో అంతా రివర్స్ తప్ప ప్రోగ్రెస్ ఏది? కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ప్రశ్నించలేని, పోరాటం చేతకాని ముఖ్యమంత్రి వల్లే రాష్ర్టానికి అన్యాయం జరుగుతోందని ప్రజలంతా భావిస్తున్నారని సయ్యధ్ రఫీ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read