గుంటూరు జిల్లా తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బీజేపీ టార్గెట్ చేసింది. ఏకంగా బీజేపీ పార్టీ నేత, రాంమాధవ్, రాయపాటి నివాసానికి వచ్చి, పార్టీలోకి తమదైన శైలిలో ఆహ్వానించారు. రెండు రోజుల క్రిందట ఈ విషయం జరగగా, ఈ రోజు వెలుగులోకి వచ్చింది. రాం మాధవ్, రాయపాటి భేటీ చాలా సీక్రెట్ గా జరిగింది, అయితే నిన్న రాయపాటి వచ్చి చంద్రబాబుని కలవటంతో విషయం బయటకు వచ్చింది. రాయపాటి, రాం మాధవ్ మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయని సమాచారం. మరో రెండు రోజుల్లో తాను ఢిల్లీ వస్తానని, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుని, ఒక నిర్ణయం తీసుకుందామని, రాయపాటి చెప్పినట్టు సమాచారం. ఈ విషయం పై రాయపాటి నిన్న చంద్రబాబుని కలిసి, జరిగిన విషయం చెప్పారు. తనకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, బీజేపీలో చేరాల్సిన పరిస్థితిని చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. రాం మాధవ్ తో జరిగిన భేటీ విషయాలు, చంద్రబాబుకు చెప్పి, పార్టీ మారక తప్పని పరిస్థితి వచ్చిందని చెప్పినట్టు తెలుస్తుంది.

దీంతో చంద్రబాబు కూడా మీ ఇష్టం అని చెప్పినట్టు సమాచారం. అయితే రాయపాటి బీజేపీలో చేరతారా లేదా అన్న విషయం, మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోనుంది. రాయపాటి 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నాలుగు సార్లు ఎంపీ కూడా అయ్యారు. తరువాత తెలుగుదేశం పార్టీల చేరి, ఇక్కడ కూడా ఎంపీ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో ఉంటారా లేదా అనే చర్చ జరుగుతూ వస్తుంది. తాజాగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వెయ్యాలని డిసైడ్ అవ్వటం, బలంగా ఉన్న నేతలను తమ వైపు తిప్పుకుని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా, ముందుగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న సామాజివర్గాన్ని టార్గెట్ చేసింది. తెలుగుదేశం పార్టీకి ఎవరు అయితే ఫైనాన్సు చేస్తున్నారో, వారిని తమ వైపు తిప్పుకుంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఈ విషయం పై స్పందించక పోయినా, కార్యకర్తలు మాత్రం, ఇలాంటి ఎక్స్ట్రా బ్యాగేజ్ అంతా పోగేస్తున్న బీజేపీకి ధన్యవాదాలు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read