లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాలు దక్కించుకున్న వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కబోతోందా..? అవుననే అంటోంది జాతీయ మీడియా. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు మంగళవారం అమరావతికి వచ్చారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో వైసీపీకి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చే విషయమై ఇద్దరి నడుమ చర్చ జరిగిందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ (52), డీఎంకే (23) తర్వాత ఎక్కువ సీట్లు (22) వైసీపీకే వచ్చాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూ (16).. తమకు కేంద్ర కేబినెట్‌లో ఒక్కటే బెర్తు ఇవ్వజూపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. కేబినెట్‌లో చేరడం లేదని ప్రకటించింది. సీఎం నితీశ్‌కుమార్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించి ఎనిమిది మంది జేడీయూ సభ్యులను మంత్రులుగా తీసుకున్నారు. బీజేపీకి ఒక్కటే ఇస్తామన్నారు.

gvl 12062019

దాంతో బీజేపీ కూడా దూరంగా ఉండిపోయింది. బిహార్‌లో మాత్రమే ఎన్డీఏ కూటమిలో ఉంటామని.. ఇతర రాష్ట్రాల్లో సొంతగా బరిలోకి దిగుతామని జేడీయూ ఆ తర్వాత ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ.. వైసీపీకి చేరువ కావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభలో 2021 మార్చి వరకూ బీజేపీ సొంత బలం సాధించలేదు. ఈ పరిస్థితుల్లో ఏవైనా బిల్లులు పాస్‌ కావాలంటే పెద్దల సభలో ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికలు జరిగితే సీట్లన్నీ వైసీపీకే వెళ్తాయి. బీజేపీకి దాని మద్దతు అవసరమవుతుంది. పైగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీతో వైసీపీ సఖ్యంగా ఉంటోంది. అందుకే ఆ పార్టీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిని బీజేపీ ఇవ్వజూపినట్లు సమాచారం. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి టీడీపీ బయటి నుంచి మద్దతిచ్చినా.. లోక్‌సభ స్పీకర్‌ పదవి (జీఎంసీ బాలయోగి) తీసుకుంది. అదే విషయాన్ని బీజేపీ నేతలు.. వైసీపీ నేతలకు గుర్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రెండు పార్టీల నాయకులూ నోరు విప్పడంలేదు.

 

gvl 12062019

గవర్నర్‌ నరసింహన్‌ను మారుస్తున్నారని, ఆయన స్థానంలో సుష్మా స్వరాజ్‌ను కేంద్రం నియమించబోతోందని వస్తున్న వదంతులను నమ్మవద్దని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు స్పష్టం చేశారు. ఇప్పట్లో నరసింహన్‌ను మార్చే యోచన కేంద్రానికి లేదన్నారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన జీవీఎల్‌ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలియజేశారు. తర్వాత విలేకరులతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌లో సేవాభావంతో బీజేపీలోకి వస్తామంటే ఎవరినైనా ఆహ్వానిస్తామని తెలిపారు. గ్రామ, మండల స్థాయుల్లో ఎవరైనా చేరవచ్చన్నారు. పెద్ద స్థాయి నేతలు చేరాలంటే అగ్రనాయకత్వం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read