ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య, జల వివాదం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అటు కేసీఆర్, ఇటు జగన్, ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో, ఇరువురి మధ్య ఎందుకు వివాదం వచ్చిందో అర్ధం కాలేదు. పోనీ పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా వందల టిఎంసిలు నీళ్ళు తీసుకువెళ్ళే ప్రాజెక్ట్ అంటే అదే కాదు. కృష్ణాలో వరదలు వచ్చిన సమయంలో, గట్టిగా ఒక 10-15 రోజులు నీళ్ళు తీసుకువెళ్ళేది. మరి ఈ ప్రాజెక్ట్ పై లేని వివాదం ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. గతంలో చంద్రబాబు, ముచ్చుమర్రి ప్రాజెక్ట్ కట్టిన సమయంలోనే, తెలంగాణాతో సమన్వయం చేసుకుని, సీమకు నీళ్ళు వచ్చేలా చేసారు. చంద్రబాబు అంటే కేసీఆర్ కు ఎంత కోపమో తెలిసిందే. మరి అలాంటి కేసిఆర్, అప్పట్లో చంద్రబాబు ముచ్చుమర్రి కట్టిన సమయంలో ఏమి వ్యతిరేకం చూపించకుండా, మాకు, జగన్ కు మధ్య మంచి స్నేహం ఉందని చెప్పి, ఇప్పుడు వివాదాలు చెయ్యటం, ఏపి కెలికి కయ్యానికి వస్తుంది, నోరు మూపిస్తాం అంటూ, చెయ్యటం, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.

అయితే ఇటు కేసీఆర్, అటు జగన్ పెద్ద డ్రామాలు ఆడుతున్నారని, లేని సమస్య సృష్టిస్తున్నారు అంటూ, ఇప్పటికే కొంత మంది విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, అయ్యా ఏమో కయ్యం అంటాడు, కొడుకు ఏమో దుస్తులు అంటున్నాడు, ఏమిటి ఈ డ్రామాలు అంటూ, జగన్ ని ఉద్దేశించి, అటు కేసీఆర్ , ఇటు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పేపర్ క్లిప్పింగ్స్ చూపించారు. జగన్ తో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయనే విధంగా రేవంత్ మాట్లాడారు. రెండు రోజులు క్రిందట కేటీఆర్ మాట్లాడుతూ, జగన్ మాకు మంచి స్నేహితుడు అని చెప్పిన విషయం తెలిసిందే. రెండో రోజే, కేసీఆర్ వచ్చి, మాతో కెలికి కయ్యం పెట్టుకున్నారు, నోరు మూయిస్తాం అంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఈ రెండు విషయాలని రేవంత్ లేవనెత్తి, ఇది ఒక పెద్ద డ్రామా అంటూ వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read