నిన్న తెలంగాణా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, ఆ ఛానల్ ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి. ముఖ్యంగా షర్మిల తన పైన చేసిన వ్యాఖ్యలు గురించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఘాటు వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉంది, కేసీఆర్ తలుచుకుంటే, రేవంత్ పిలకే కాదు, రేవంత్ తల కూడా తీసేస్తాడు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల పై రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా, రేవంత్ తనదైన శైలిలో స్పందించారు. షర్మిలను ఉద్దేశిస్తూ, నా మీద ఉన్నది ఒకే ఒక కేసు అని, అది కూడా నిలిచే కేసు కాదని, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అంతకు మించి మాట్లాడను అని, ఈ ఒక్క కేసుకే నా పిలక కేసిఆర్ దగ్గర ఉంటే, నీ అన్న కేసులు గురించి ఏమిటి అని ప్రశ్నించారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దర్యాప్తు సంస్థలు, జగన్ వెంట పడుతున్నాయని, సిబిఐ, ఈడీ, ఫేమా, ఇలా ఒకటా రెండా అన్ని కేసులు పెట్టుకున్న వ్యక్తి చెల్లిగా, తన అన్న గురించి ఆలోచించాలి అని అన్నారు. షర్మిలకు, జగన్ కు ఎవో తగాదాలు ఉన్నాయని, తన అన్నను ఇరికించాలని, కేసులు గురించి మాట్లాడి తన అన్నను బద్నాం చెయ్యాలని ఆమె చుస్తుందేమో అని, షర్మిలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

revanth 25102021 2

షర్మిలకు జగన్ తో పంచాయతీ ఉంటే, కుల పెద్దలనో, మత పెద్దలనో పెట్టుకుని ఆ సమస్యలు తీర్చుకోవాలని, ఆస్తుల పంపకాలు చేసుకోవాలని, అంతే కానీ ఆ చికాకు, తమ పైన చూపించ వద్దని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు, జగన్ సపోర్ట్ లేదని, అయినా జగన్, షర్మిల, విజయమ్మ అందరూ కలిసి వచ్చి, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సెంటిమెంట్ ఉన్న 2014లోనే, వాళ్ళకు మూడు సీట్లు వచ్చాయని, ఇప్పుడు షర్మిల ఒక్కటే వస్తే, ఏమి అవుతుందని అన్నారు. ఇక హెటిరోలో దొరికిన సొమ్ము పై కూడా రేవంత్ వ్యాఖ్యలు చేసారు. క-రో-నా సమయంలో ఇంజెక్షన్ల పేరుతో దండుకున్నారని, అప్పుడే తాను ఈ విషయం ప్రస్తావించానని అన్నారు. అది పేద ప్రజల సొమ్ము అని రేవంత్ అన్నారు. హెటిరో సంస్థతో కేసీఆర్, కేటీఆర్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని, రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హెటిరో సంస్థ, జగన్ కేసుల్లో కూడా సహా నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం జగన్, షర్మిల టార్గెట్ గా రేవంత్ పంచులు పేల్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read