ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్స్ అసోసియేషన్ కలెక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఆరు నెలలుగా, రాష్ట్రంలోని చాలా మంది తహశీల్దార్లకు జీతాలు కూడా రావడం లేదని, దీనికి ఎవరు బాధ్యులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కలెక్టర్లు చేసిన తప్పులతో,  తహశీల్దార్లకు జీతాలు నిలిచిపోయాయి అంటూ, రెవెన్యూ అసోసియేషన్ తరుపున బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క బదిలీల పై నిషేధం ఉన్నా సరే, ఈ సమయంలో కలెక్టర్లు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసారని అన్నారు. కలెక్టర్ లు ఇలా ఇష్టం వచ్చినట్టు బదిలీ చేయటం వలనే, ఈ రోజు తమకు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ బదిలీలు అన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయంగా వస్తున్నఒత్తిళ్లతోనే, కలెక్టర్లు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ తప్పిదానికి బాధ్యత వహించాలని, ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ బదిలీల పై , బాధ్యులైన అధికారులకు జీతాలు నిలిపివేయాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read