ప్రముఖ కాంట్రాక్టర్, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రీతి పాత్రుడు అయిన, మేఘా కృష్ణా రెడ్డి ఇంటితో పాటుగా, దేశ వ్యాప్తంగా 34 చోట్ల ఏకకాలంలో ఐటి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న నిన్న వేకువజామున మొదలైన ఐటి దాడులు, నిర్విరామంగా, 42 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఐటి టీంలు వస్తూ, వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు మేఘా కృష్ణా రెడ్డి ఇంటి ముందు, కొంత మంది సీఆర్పీఎఫ్ ఫోర్సు ఉండటం గమనార్హం. సహజంగా, ఐటి రైడ్స్ సమయంలో, లోకల్ పోలీస్ సహాయం తీసుకుంటారు. అయితే ఇక్కడ ఐటి టీమ్స్ కూడా ఢిల్లీ నుంచి వచ్చాయి. ఇక్కడ బలగాలు కూడా, మొత్తం సీఆర్పీఎఫ్ ఉన్నారు. మరో పక్క, తెలుగు మీడియాలో ఒక్కటంటే ఒక్క వార్తా కూడా ఈ విషయంలో వెయ్యటం లేదు. నిన్న దాడుల విషయం పై, రెండు మూడు చానెల్స్ బ్రేకింగ్ వేసి ఆపేశాయి. ఇక ఆ తరువాత, ఈ విషయంలో వార్త అనేది లేదు.

raids 12102019 2

ఒక చిన్న ఉద్యోగి ఏసిబి రైడ్స్ లో దొరికితేనే, రచ్చ రచ్చ చేసే తెలుగు మీడియా, ఇంత పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతుంటే, అసలు స్పందించటం లేదు. కారణం ఏమిటో కాని, ఈ విషయంలో మాత్రం, తెలుగు మీడియా సైలెంట్ గా ఉండి పోయింది. మొదటి రోజు తనిఖీల్లో, సంస్థకు చెందిన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు, ల్యాప్ ట్యాప్ లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు, వాటి పై విశ్లేషణలు జరుపుతున్నారు. నిపుణులు అవన్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ దాడులు, ఇంకా ఎంత సేపు కొనసాగుతాయి అనేది చూడాల్సి ఉంది. సహజంగా, ఎక్కడ రైడ్స్ జరిగినా, ఒక రోజులు అయిపోతాయి. ఇక్కడ మాత్రం రెండు రోజులుగా, అదీ నిర్విరామంగా, సీఆర్పీఎఫ్ భద్రత మధ్య, ఢిల్లీ టీమ్స్ సోదాలు చేస్తున్నాయి.

raids 12102019 3

నిన్న కొంత మంది జాతీయ మీడియా ప్రతినిధులు, పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు, ఫేక్ బిల్స్ గుర్తించారని, ట్వీట్ చేసారు. అయితే, ఇప్పుడు అసలు లోపల ఏమి జరుగుతుంది ? ఏది అక్రమం ? ఏది సక్రమం ? అని చెప్పే వారే లేరు. మరో పక్క మేఘా సంస్థ మాత్రం నిన్న ఉదయం, ఇదంతా రొటీన్ అని దీనికి కవరేజ్ అవసరం లేదని, ఒక ప్రకటన ఇచ్చాయి. రొటీన్ అయితే, ఇలా రెండు రోజులు నుంచి, ఒక ప్రముఖుడి ఇంట్లో, సీఆర్పీఎఫ్ బద్రత నడుమ, ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్స్ సోదాలు చెయ్యల్సిన అవసరం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ సమాచారం తెలుగు మీడియా ఎందుకు రిపోర్ట్ చెయ్యటం లేదు ? ఇంత పెద్ద సెన్సేషన్ జరుగుతుంటే, మీడియా ఎందుకు నోరు కట్టేసుకుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. సోదాలు ముగిసిన తరువాత అయినా, ఐటి అధికారులు కాని, మేఘా కృష్ణా రెడ్డి కాని, ఈ విషయంలో క్లారిటీ ఇస్తారేమో ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read