ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చాలు ప్రతి ఒక్కరికీ ఒక ప్రయోగసాల అయిపొయింది. ఒక జోక్ అయిపొయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకునే గ్రౌండ్ అయిపొయింది. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఒకలా ఆడుకుంటే, సొంత రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మరొకలా వాడుకుంటున్నారు. విభజన జరిగిన దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ అంటే మరీ జోక్ అయిపొయింది. బహుసా ఇందులో ప్రజల గురించి కూడా చెప్పుకోవాలి. ప్రజలు కూడా సొంత లాభాలు కోసం కాకుండా, రాష్ట్రం గురించి, రాష్ట్ర హక్కుల గురించి ఆలోచించటం మొదలు పెడితే, ఇలాంటి వారి ఆటలు సాగేవి కాదేమో. సరే ఏది ఏమైనా, మనతో ఆడుకుంటున్న వారి గురించి ప్రజలకు అవాగాహన కలిగించటం తప్ప మనం చేయగలిగేది ఏమి ఉండదు అనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే నిన్న ఏబీఎన్ ఛానల్ లో వచ్చే వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో, రాధాకృష్ణ ఒక విషయం గురించి ప్రశ్నించారు. అదేమిటి అంటే, కేసీఆర్ పుట్టిన రోజు వేడుకులకు, మొక్కలు నాటండి అంటే ఎగబడి నాటిన తెలుగు సినిమా పెద్దలు, హీరోలు, నటీమణులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విశాఖ ఉక్క ప్రైవేటీకరణ గురించి ఎందుకు మాట్లాడటం లేదు ? ఆ ఉద్యమానికి ఎందుకు మద్దత తెలపటం లేదు ? అని నిన్న వీకెండ్ కామెంట్ లో ఆర్కే ప్రశ్నించారు.

tfi 21022021 2

నిజానికి ఇది మంచి ప్రశ్న. రాజకీయాలు అతీతంగా ఆలోచించాల్సిన ప్రశ్న. సినీ పరిశ్రమ ఇలా చేయటం మొదటి సారి కాదు, చివరి సారి కూడా కాదేమో. తెలుగు సినీ పరిశ్రమకు అధిక శాతం వసూళ్ళు వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది వస్తే, తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకం అయ్యేది. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఏమి అనుకుంటుందో అనో, లేకపోతే మరేదైనా కారణమో కానీ, తెలుగు సినీ పరిశ్రమ అసలు ఏపి సమస్యల పై స్పందించటం లేదు. చిన్న చిన్నవి కాకపోయినా, విభజన లాంటి పెద్ద విషయాలు, కేంద్రంతో పోరాటం, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అయిన విశాఖ ఉక్కు, ఇలా ఏ విషయంలో కూడా సినీ పరిశ్రమ మద్దతు లేదు. వాళ్ళు మద్దతు తెలిపితే, పోరాటం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనటంలో సందేహం లేదు. తమిళనాడులో జల్లి కట్టు విషయాలో, రజినీకాంత్ నుంచి చిన్న హీరో వరకు, పరిశ్రమ మొత్తం కేంద్రం పై నిరసన తెలిపింది. మరి మన తెలుగు సినీ పరిశ్రమ పుట్టిన రోజు కార్యక్రమాలు కాకుండా, తెలుగు వారి హక్కుల పై కూడా పోరాడటానికి ముందుకు వస్తే అందరికీ మంచిది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read