జగన్ ప్రభుత్వం పై, మరోసారి కేంద్రం ఫైర్ అయ్యింది. ఒక పక్క విజయసాయి రెడ్డి, మేము చేసి ప్రతి పనికి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి, మేము అన్నీ వారికి చెప్పి, వారి అనుమతితోనే చేస్తున్నాం అని చెప్తుంటే, కేంద్రం మాత్రం, ప్రతి విషయంలోనూ తీవ్రంగా స్పందిస్తుంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి, కేవలం చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో, చంద్రబాబు హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ఇంపాక్ట్ రాష్ట్రంలోనే కాక, దేశం మొత్తం విద్యుత్ పెట్టుబడులు పై పడింది. ఒప్పందాలు జరిగిన సమయంలో అటు కేంద్రం కాని, ఇటు ట్రిబ్యునల్ కాని పర్యవేక్షణలో జరుగుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదు. అయినా సరే, ఎదో జరిగిపోయింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో ముందుకు వెళ్లారు.

rksingh 09092019 2

అయితే, ఈ చర్యను కేంద్రం తప్పుబట్టింది. ఇలా చేస్తే, పెట్టుబడులు పెట్టె వారు, వెనక్కు వెళ్లి పోతారని, ఒకసారి ఒప్పందం అయిన తరువాత, మళ్ళీ సమీక్ష చేస్తే, పెట్టుబడి వర్గాలు, ఇది మంచి పరిణామం కాదని చెప్పింది. చివరకు హైకోర్ట్ కూడా, ఇదే చెప్పింది. అలాగే ట్రిబ్యునల్ కూడా ఇవే ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం చెప్పినట్టే, జపాన్ ప్రభుత్వం, ఈ వ్యవహారం పై అసహనం వ్యక్తం చేస్తూ, మా పెట్టుబడి దారులను ఇబ్బంది పెడితే, మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టం అని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా జగన్ వైఖరి మారలేదు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హైదరాబాద్ వచ్చారు. కేంద్రం వంద రోజుల ప్రగతి పై, ఆయన ఒక నివేదక సమర్పించారు. ఈ సందర్భంగా జగన్ పై విరుచుకు పడ్డారు. పవర్ ప్రాజెక్ట్ ల పై జగన మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అంతా స్వయంగానే జరిగింది అని మేము చెప్పినా వినటం లేదని అన్నారు.

rksingh 09092019 3

సరైన విధానం ఉంటేనే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, ఈ వాతావరణాన్ని చెడగొడుతూ, మేము చెప్పినా జగన్ వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి ఒక లేఖలతో జగన్ వచ్చి రద్దు చేయమని కోరారని, దీనివల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు మాత్రం ఇవ్వ లేవని, సరైన ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయాలని జగన్ కోరుతున్నారని ఆర్కే సింగ్ ఆరోపించారు. జగన్ వైఖరితో పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, పవర్ ప్రాజెక్టుల పై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి ఇప్పటికైనా జగన్ గారు మారతారో, ఇంకా తవ్వుతూనే ఉంటారో చూద్దాం.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read