రాష్ట్రంలో ఉల్లి కష్టాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ఈ కష్టాల భారిన పడింది. అయితే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కావటంతో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, ఈ అంశం పై అసెంబ్లీలో లేవనెత్తింది. అయితే మేము ఈ రోజు కేవలం మహిళల సమస్యల పైనే చర్చ చేస్తామని, ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. ఈ సమయంలో వాగ్వాదం జరిగింది. ఒక పక్క గుడివాడలో, ఈ రోజు ఉల్లిపాయల కోసం, మార్కెట్ లో నిలబడి నిలబడి, ఒక వ్యక్తీ చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ, మాకు మహిళల సమస్యల పై కూడా చిత్తశుద్ధి ఉందని, కాని రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఎదుర్కుంటున్న, ఉల్లి సమస్య పై చర్చించాలని తెలుగుదేశం పట్టుబట్టింది. ఈ సందర్భంలో, వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. మహిళలు ఎదురుకుంటున్న సమస్యల పై, చర్చించకుండా, తెలుగుదేశం ఉల్లి ఉల్లి అంటూ గొడవ చేస్తున్నారని రోజా అన్నారు.

roja 09122019 2

ఆవిడ మాట్లాడుతూ, ఉల్లి లేకపోతే చచ్చిపోతారు అనే విధంగా మాట్లాడుతున్నారు అంటూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క ప్రజలు ఉల్లిపాయల కోసం, అల్లాడి పోతూ, రోజులకు రోజులు లైన్ లో నుంచుని నుంచుని ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రోజా ఇలా మాట్లాడటం కరెక్ట్ కదాని తెలుగుదేశం అంటుంది. నిజంగానే, ఈ రోజు ఉల్లి కోసమే ఒక వ్యక్తీ చనిపోయిన విషయం, రోజా గారికి తెలియదా అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఒక పక్క మనుషులు చనిపోతుంటే, ఇలా హేళనగా ఎలా మాట్లాడతారు అంటూ ఆరోపిస్తూ, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది టిడిపి. "ఉల్లి లేకపోతే ప్రాణం పోతుందా అన్నట్టు మాట్లాడుతున్నారు రోజాగారు. ఇదే మాట వెళ్ళి రైతుబజార్ల దగ్గర క్యూ లైన్లో ఉన్నవాళ్ళతో అనగలరా మేడమ్? ఉల్లి కోసం లైన్లో పడిగాపులు కాసి ప్రాణాలు పోగొట్టుకున్న ఈ నిరుపేదపట్ల మీరు చూపించే మానవత్వం ఇదేనా?" అంటూ పోస్ట్ చేసారు.

roja 09122019 3

రైతుబజార్ల ద్వారా ప్రభుత్వం 25 రూపాయలకు కిలో ఉల్లి సరఫరా చేస్తున్నప్పు టికీ, ధర దిగిరాకపోగా మరింతగా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో మహారాష్ట్ర రకం ఉల్లి కిలో 190 రూపాయల ధర పలుకుతోంది. కర్నూలు జిల్లాలో గత ఏడాది 84వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా ఈ ఏడాది 32వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గతంలో ఎకరాకు 70బస్తాల (50కిలోలు) వరకూ దిగుబడి రాగా, ప్రస్తుం 20బస్తాల మేర మాత్రమే దిగుబడి వస్తోంది. వి ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినప్పటికీ, ఇతర రాష్ట్రాలకు ఎగు మతులు ఎక్కువ కావడం వల్ల ధర గణనీయంగా పెరుగుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా శుక్రవారం ఉల్లి క్వింటాలు 13,010 రూపాయల ధర పలికింది. ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా 25 రూపాయలకే కిలో ఉల్లి సరఫరా అంటూ ప్రచారంతో ఊదరగొట్టేస్తోంది. వాస్తవానికి వివిధ పట్టణాలు, నగరాల్లో డిమాండ్లో దాదాపు సగం మేరకే ఉల్లిని సరఫరా చేస్తోంది. దీంతో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ క్యూలో ఉన్న అందరికీ ఉల్లి దక్కుతుందన్న గ్యారంటీ లేకుండాపోతోంది. డిమాండ్ కు అనుగుణంగా ఉల్లి సరఫరా చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధర పెరుగుతోంది. జనవరి ప్రారంభం వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read