ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. వనభోజనాలు టైం. ఎవరి కులం వాళ్ళు, ఇంకా చెప్పాలంటే, ఎవరి ఇంటి పేరున వాళ్ళు, కార్తీక వనసమారాధనలను చేసుకుంటూ ఉంటారు. కుల భోజనాలు అని కూడా, వీటికి పేరు ఉంది. ఒక కులం అని కాదు, అన్ని కులాల వారు ఇలాగే చేస్తారు. ఇక్కడ వరకు పర్వాలేదు కానీ, మా కులమే గొప్ప, అవతలి కులం ఇలా అలా అంటే మాత్రం, ఇది ఆక్షేపనీయం. ఇక ఈ కుల భోజనాల్లో, రాజకీయాలు మాట్లాడితే అంతకంటే హేయం కూడా ఉండదు. నీ కులం గురించి గొప్పగా చెప్పుకో, నీ చరిత్ర చెప్పుకో, నీ కులంలో ఉన్న గొప్పవాళ్ళని స్మరించుకుని, వారిలా జీవితంలో ఎలా ఎదగాలి అనేది నేర్చుకుంటే, ఇలాంటి వాటికి ఏమైనా అర్ధం ఉంటుంది. అంతే కాని, కులం గజ్జిని, భవిష్యత్తు తరానికి అందిస్తూ, మనమే గొప్ప, ఎదుటి వాళ్ళు అందరూ అల్పులు, అని అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తే మాత్రం, ఇది ఏ మాత్రం సమాజానికి మంచిది కాదు. మన కర్మకి, ఇప్పుడు ఇలాగే జరుగుతుంది.

roja 1112019 2

అయితే ఇప్పుడు నిన్న జరిగిన ఒక సంఘటన గురించ చెప్పుకుందాం. కాకినాడ సమీపంలోని అచ్చంపేటలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, కార్తీక వన సమారధాన జరిగింది. ఈ కార్తీక వనసమారాధనలకు, ముఖ్య అతిధిగా, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌కే రోజా వచ్చారు. ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం, జగన్ అన్న పాలనలో, రెడ్డి కులస్థులు కార్తీక వనసమారాధనలను చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఇక్కడతో ఆగకుండా, తెలుగుదేశం పార్టీ పై కుల విమర్శలు చేసారు. గత అయుదు సంవత్సరాల్లో చంద్రబాబు రెడ్లను తొక్కి పెట్టి, తీవ్రంగా అవమానపరిచారని అన్నారు. రెడ్ల అందరూ, కష్టపడి జగన్ అన్నకు, 151 సీట్లు వచ్చేలా కష్టపడ్డారని, రెడ్లు అంటే ఒక కులం కాదని, ఒక గుణం, ఒక ధైర్యం, ఒక భరోసా అని, రోజా అన్నారు.

roja 1112019 3

అయితే, రోజా వ్యాఖ్యల పై, పెద్ద దుమారమే రేగింది. 151 మంది ఎమ్మెల్యేలు గెలవటానికి, కేవలం రెడ్లు మాత్రమే సహాయం చేసారా ? మిగతా కులాల వారి సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మీకు వచ్చిన 50 శాతం ఓట్లు రెడ్ల వల్ల వచ్చాయి అంటారా అని ప్రశ్నిస్తున్నారు. మిగతా కులాల వాళ్ళు మీకు ఓట్లు లేదంటారా ? చివరకి కమ్మ కులంలో నుంచి కూడా దాదాపుగా 40 శాతం ఓట్లు వైసిపీకి పడ్డాయని గుర్తు చేస్తున్నారు. రెడ్లు మాత్రమే సంతోషంగా ఉంటే చాలా అని రోజా వ్యాఖ్యలకు ప్రశ్నిస్తున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, అన్ని కులాలు వారు, మతాల వారు, చివరకు రెడ్డి కులస్తులు కూడా, పనులు లేక పస్తులు ఉంటున్నారని, వారిని కూడా సంతోష పెట్టే కార్యక్రమం చెయ్యమని, జగన్ కు చెప్పమని అంటున్నారు. ఇక చంద్రబాబు రెడ్లను తోక్కేసారు అనటం పై కూడా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు 5 మంత్రి పదవులు ఇచ్చి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి రెడ్లను గౌరవించారని గుర్తు చేస్తున్నారు. అంతెందుకు, ఇన్ని చెప్తున్న రోజా రెడ్డి గారిని, రాజకీయాల్లోకి తీసుకు వచ్చిందే చంద్రబాబు అనే విషయం, ఆమె మర్చిపోవటం, ఆశ్చర్యకరం. చంద్రబాబు సమాజంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని, కుల ముద్ర వేసుకోవాలి అంటేనే ఆయన భయపడతారని గుర్తు చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ, కులాల పై మాట్లాడటం, సమంజసం కాదని, రోజాకి గుర్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read