ఇంద్రకీలాద్రికి చెందిన వెండి రథంలోని మూడు సింహాలు మాయం అయ్యాయన్న సమాచారం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఈ నెల 5వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయ రధం అగ్నికి ఆహుతి అయిన సంఘటన నేపధ్యంలో రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన రధాలు, ఇతర ఊరేగింపునకు వినియోగించే పల్లకిలు, వాహనాలు తదితరాలను భద్రపరుచుకోవాలని పోలీసులు సూచించారు. వాటికి జీయో ట్యాగింగ్ చేయాలని వాటి పరిరక్షణ దేవస్థానాల నిర్వహకులు, అధికారులు బాధ్యత వహించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అంతర్వేది, అంతకముందుగత 15 నెలలుగా వివిధ దేవాలయాలలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ సంఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా రగడ నడుస్తోంది. రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి పరిస్తితిలో దుర్గగుడి వెండి రధంలోని రెండు సింహాలు మాయమయ్యాయన్న సమాచారం సంచలనం కలిగిస్తోంది. మహమండపం సమీపంలో వెండి రధాన్ని పార్కింగ్ చేసి ఉంచారు. ఊరేగింపులప్పుడు ఈ రధాన్ని బయటకు తీస్తారు. దసరా ఉత్సావలలో ప్రతి రోజు సాయంత్రం జరిగే నగరోత్సవం, చైత్రమాసం బ్రహ్మోత్సవాలు, ఉగాది సందర్భంగా, భవానీ దీక్షలలో కలశ పూజోత్సవం సందర్భంగా రధంలో అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.

వెండి రధానికి బీమా సౌకర్యం ఉందని తగు జాగ్రత్తలు తీసుకున్నామని రెండు రోజుల క్రితమే దుర్గగుడి ఈవో సురేష్ బాబు వివరణ ఇచ్చారు. తాజాగా సింహాలు మాయమయ్యాయన్ని మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది. అయితే ఈవో సురేష్ బాబు సింహాలు మాయమయ్యాయన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. వెండి సింహాలు రధంలో ఉండే అవకాశం లేదని, వాటిని వాహనాలు భద్రపరిచే చోట లేదా వెండి సామానులు ఉంచే గదిలో, లాకర్లో ఉంచే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు. వెండి సింహాల విషయమై రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని, లాకరన్ను చూసిన తరువాత కానీ ఇందులో వాస్తవం ఎంతనేది చెప్పలేమని చెబుతన్నారు. నిజంగా సింహాలు మాయమైనట్లయితే సెక్యూరిటీ సిబ్బందే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం వెండి రథంలోని వెండి సింహాలు మూడు మాయమయ్యాయన్న సమాచారం కలకలం రేపుతోంది.

కొండపై ఇరవై మంది హోంగార్డులు, 150మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ఇంత పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ వెండి సింహాలు ఎలా మాయం అయ్యాయన్నది మిస్టరీగా మారింది. ప్రతి ఏడాది ఉగాది రోజు మాత్రమే రథంపై అమ్మవారిని ఊరేగిస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. 2019లో చివరి సారిగా ఊరేగింపు జరిగింది. అనంతరం వీటిని లాకర్ లో భద్రపరచాల్సి ఉంటుంది. వెండి సింహాలు భద్రంగా ఉన్నాయా.. లేదా అన్న విషయం తేలాలంటే రికార్డులు, లాకర్‌ను పరిశీలిస్తే కానీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. తాజా ఘటన పాలకులు, అధికారులను ఇరకాటంలో పడేసింది. వెండి సింహాలు మాయమైన మాట నిజమైతే పెద్ద దుమారమే రేగుతుందనడంలో సందేహం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read