ఈ రోజు నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తన ఎంపీల చేత ఎలాంటి పోరాటం చెయ్యాలి అనే అంశం పై పార్టీ అధ్యక్ష్యుడు జగన్ తో, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. అయితే ఈ సమావేశానికి రావాలని మొదట రఘురామకృష్ణం రాజు ని పిలిచిన ఏపి భవన్ అధికారులు, తరువాత రెండు గంటలకు మీరు రానవసరం లేదు అంటూ, రఘురామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చారు. అయితే ఈ విషయం పై అదే స్థాయిలో రియాక్ట్ అయిన రఘురామరాజు, మీడియా మందు చాకిరేవు పెట్టి, జరిగిన విషయం స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేసారు. ఈ అంశం పై రఘురామ రాజు మాట్లాడుతూ, "రాష్ట్రం కోసం మనం ఢిల్లీలో ఎలా పోరాడాలి, ఎందుకంటే రాష్ట్రం కోసం పోరాడే విషయంలో, పార్టీలకు అతీతంగా కలిసి పోరాడితేనే, ఢిల్లీలో విలువ ఉంటుంది. ఎలా పోరాడాలి అనే విషయంలో, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రతి ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఎలా పోరాడాలి ఏమి పోరాడాలి అనేది చెప్తారు. స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా చెప్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమావేశంలో పాల్గునాలని నాకు, ఉదయం 9:10కి ఆంధ్రా భవన్ నుంచి ఒక అధికారి ఫోన్ చేసి, ఇలా ముఖ్యమంత్రి గారు, వీడియో కాన్ఫరెన్స్ లో , పార్లమెంట్ లో ఎలాంటి అంశాల పై పోరాడాలి అనే దాని పై దిశానిర్దేసం చేస్తారు, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మీరు పాల్గునాలి, తరువాత లంచ్ కూడా ఉంటుంది, మీరు లంచ్ చేసి వెళ్ళాలి అని చెప్పారు. "

"అయితే నేను సంతోషించాను. ఆంధ్రభవన్ కాబటి, అందరు ఎంపీలను పిలిచారేమో అనుకుంటే, కేవలం యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీలను మాత్రమే పిలిచారని అనుకున్నారు. అయితే మళ్ళీ ఏమైందో ఏమో, 11 గంటలకు మళ్ళీ అదే అధికారి ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని రావద్దు అన్నారని, పై నుంచి కబురు వచ్చింది, మిమ్మల్ని రావద్దు అన్నారని చెప్పారు. అదేంటి నన్ను రమ్మన్నారు, భోజనం కూడా చేసి వెళ్ళమన్నారు, మళ్ళీ ఇప్పుడు రావద్దు అంటారు ఏంటి అని అడిగితే, లేదు అండి పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నారు. మరి మీ ద్రుష్టిలో నేను పార్టీలో లేనట్టా అని అడిగితే, లేనట్టే అనుకుంటా అండి అనే సమాధానం వచ్చింది. అయితే మొన్న ప్రజా సమస్యలు చెప్పినప్పుడు, షోకాజ్ నోటీస్ వచ్చింది. అలాగే ఇప్పుడు రఘురామరాజు పిలిచినా రాలేదు అంటారేమో, మళ్ళీ నోటీస్ ఇస్తారేమో అని భయం వేసి, స్పీకర్ గారికి జరిగిన విషయం చెప్పి, మీడియా ముందు కూడా సాక్ష్యం ఉంటుందని చెప్తున్నా. పిలిచారు రావద్దు అన్నారు, పార్టీలో మీరు లేరు అన్నారు. అంటే నన్ను బషిష్కరించారేమో అని అర్ధం అవుతుంది." అని రఘురామరాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read