జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై, బయట ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పై 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పటికే 16 నెలలు ఈ కేసు విషయంలో, జైలు జీవితం కూడా గడిపారు. అయితే, చార్జ్ షీట్లు ఫైల్ చేయటంతో, జగన్ కు బెయిల్ వచ్చింది. గత 7 ఏళ్ళుగా ఆయన బెయిల్ పైనే ఉన్నారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కోర్టు విచారణకు హాజరు కావటం లేదు. అలాగే బీజేపీ నేతలు, జగన్ ను జైలుకు పంపిస్తాం అంటూ బెదిరిస్తున్నారు. దీంతో తాడో పేడో తేల్చేయాలని, మా ముఖ్యమంత్రి రాముడో, రావణుడో తెల్చేస్తాను అంటూ, అదే పార్టీకి చెందిన రఘురామకృష్ణం రాజు, బెయిల్ రద్దు చేయాలి అంటూ, సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయతే గత వారం, మరిన్ని డాక్యుమెంట్ లు కావాలి అంటూ, సిఐఐ కోర్టు ఆ పిటీషన్ ను తిప్పి పంపించింది. అయితే దీని పై గత శుక్రవారమే మళ్ళీ కేసు వేయాలని ప్రయత్నం చేసినా, సిబిఐ న్యాయమూర్తి బిజీగా ఉండటంతో కుదరలేదని రఘురామరాజు చెప్పారు. అయితే ఇది ఇలా ఉంటే, ఈ రోజు అంటే, సోమవారం, ఈ కేసు సిబిఐ కోర్టులో విచారణకు వస్తుందని రఘురామరాజు ధీమాగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి జగన్ బెయిల్ విషయంలో ఏదో ఒకటి తెలిపోతుందని ఆయన చెప్తున్నారు.

rrr 12042021 2

ఈ మేరకు ఆయన నిన్న, ఆదివారం ఒక వీడియో సందేశం పంపించారు. హైకోర్టుకు సోమవారం సెలవు ఉంది కానీ, సిబిఐ కోర్టుకు సెలవు లేదని చెప్పారు. అందుకే తాను వేసిన పిటీషన్ ను న్యాయమూర్తి విచారణకు తీసుకుని, తగు ఆదేశాలు ఇస్తారని అనుకుంటున్నా అని అన్నారు.అలాగే సిబిఐకి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విషయంలో అనుమానాలు వ్యక్తం చేసారు. ఆయన ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. ఆయన నిందుతులు తరుపున వాదిస్తున్నారో, సిబిఐ తరుపు వాదిస్తున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. ఈయన సంగతి కూడా ఈ రోజు తేలిపోతుందని అన్నారు. స్నేహమేరా జీవితం అంటూ పాట పాడతారో, నీ భరతం పడతా నేడు అంటూ పాడతారో చూడాలని అన్నారు. సిబిఐ కోర్టులో ఈ రోజు ఏమి జరుగుతుందో, అందరితో పాటు తనకూ ఆసక్తి ఉందని, ఒకవేళ సిబిఐ కోర్టు సరిగ్గా స్పందించక పొతే, హైకోర్టుకు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని రఘురామరాజు తేల్చి చెప్పారు. మరి ఈ రోజు ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read