కొద్ది సేపటి క్రితం ఎంపీ రఘురామకృష్ణం రాజు పంపినటువంటి మెసేజ్ లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైటులో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని చెప్పారు. నిన్నటి వరకు ఆ వెబ్సైటులో తన పేరు ఉందని, ఈ రోజు తన పేరు తొలగించారని, పార్టీలో నుంచి సస్పెండ్ చేసారా ఏంటి అనే విషయం తనకు తెలియదు అంటూ ఆయన మెసేజ్ మీడియాకు పంపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైటు అంటూ రఘురామకృష్ణం రాజు పంపిన మెసేజ్ లో ఆయన పేరు అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోకసభ ఎంపీలు 22 మంది అయితే, ఇక్కడ మాత్రం కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. రాజ్యసభ సభ్యులతో కలిసి మొత్తం 28 మంది ఎంపీలు కాగా, ఇక్కడ మాత్రం 27 మందిని మాత్రమే పెట్టారు. రఘురామకృష్ణం రాజు పేరు మాత్రం, ఇందులో నుంచి మాయం అయ్యింది. అయితే ఇప్పటి వరకు రఘురామకృష్ణం రాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఎక్కడా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఇక్కడ ఎందుకు ఆయన పేరు లేదు అనే అంశం పై మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇదే ప్రశ్న రఘురామరాజు లేవనెత్తారు. తాను పార్టీలో ఉన్నానో, లేదో చెప్పాలని, క్లారిటీ ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు ఆ మెసేజ్ లో ప్రశ్నలు సందించారు.

rrr 1206 2021 2

ఇది ఇలా ఉంటే, ఇప్పటికే ఒకసారి రఘురామరాజు ఎంపీ పదవి పై అనర్హత వేటు వేయాలి అంటూ, గతంలోనే ఫిర్యాదు చేసిన వైసీపీ, నిన్న జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం మళ్ళీ స్పీకర్ ని కలిసి, రఘురామరాజుని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పాడుతున్నారని, అందుకే ఆయన పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని ఎంపీ మార్గాని భరత్ కోరారు. అయితే ఒక పక్క ఎంపీ పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూనే, ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది తేడా కొడుతుంది. అలా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మాత్రం, ఆయన ఎంపీ పదవి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని, రఘురామకృష్ణం రాజు, స్పీకర్ వద్దకు వెళ్లి ఇదే అంశం చెప్పే అవకాసం ఉంటుంది. అయితే రఘురామరాజు మాత్రం, నేను ఎక్కడా పార్టీ కార్యకలాపాలు చేయలేదని, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు మాత్రమే ఎత్తి చూపుతున్నా అని, తన పై అనర్హత అనేది అయ్యే పని కాదని తెగేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ అయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read