ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. సహజంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసే ప్రసంగాన్ని వైసీపీ నేతలు అడ్డుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అందుకు భిన్నంగా సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. రఘురామ రాజు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఒక పధ్ధతి ప్రకారం దాడి జరుగుతుంది అని అన్నారు. అలాగే కేవలం ఒక వ్యక్తి కోసం ఏకంగా హిందూ దేవాలయాల రూల్స్ మార్చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రఘురామరాజుకి వైసీపీ ఎంపీలు అడ్డు తగిలారు. ప్రస్తుతం జరుగుతున్న సభలో సభ్యులు కూర్చుని మాట్లాడుతున్నారు. అయితే, ఆయనకు అడ్డుగా వైసిపీ ఎంపీలు రావటంతో, రఘురామరాజు పైకి లెగిసి ప్రసంగించారు. అయినా ఎంపీలు అడ్డు తగలటంతో, రఘురామరాజు "ఏమి మాట్లాడాలి, మీరు నాకు చెప్తారా" అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దారుణాల పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని అన్నారు.

రఘురామరాజు మాట్లాడుతూ, "నేను ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జరుగుతున్న ఒక అతి ముఖ్యమైన విషయం పై పార్లమెంట్ దృష్టికి తేవాలని అనుకుంటున్నాను. హిందూ దేవాలయాల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పద్దతి ప్రకారం దాడులు జరుగుతున్నాయి. అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులు గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పై జరుగుతున్న దాడులను రక్షించుకోవటానికి, ఒక హిందూ కమిషన్ లేదా ధార్మిక కమిషన్ ఉండాలి. ముస్లిం మైనారిటీ, లేదా క్రీస్టియన్ మైనారిటీలు ఎదుర్కుంటున్న సమస్యల కోసం, ఎలా అయితే కమిషన్ ఉందో, అలాగే హిందూ దేవాలయాలకు కూడా ఒక కమిషన్ ఉండాలి. హిందువులకు కూడా కమిషన్ ఉండాలి. ఎందుకంటే తిరుమలలో ఏకంగా కేవలం ఒక వ్యక్తి కోసం, రూల్స్ మార్చేస్తున్నారు. కేవలం ఒక్కడి కోసం, రూల్స్ మార్చేస్తున్నారు. హిందూ దేవాలయకు ఏది రక్షణ" అంటూ రఘురామరాజు పార్లమెంట్ లో తన వాణి వినిపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read