నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రభుత్వం పేదలకు, ప్రభుత్వానికి, వాళ్ళు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు అంటూ, ఆయన పై ఏపి సిఐడి సుమోటాగా కేసు నమోదు చేసి, ఆయన్ను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను హైదరాబాద్ నుంచి నిన్న రాత్రి మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే రఘురామకృష్ణ రాజు తరుపు న్యాయవాదులు, నిన్న ఈ విషయం పై హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై ఈ రోజు వాదనలు జరిగాయి. రఘురామకృష్ణ రాజు తరుపున న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. విచారణ అనంతరం, రఘురామరాజు వేసిన పిటీషన్ ని, కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం ముందుగా, సిఐడి కోర్టుకు వెళ్ళాలని, అక్కడే పిటీషన్ వేసుకోవాలని సూచించారు. సిఐడి కోర్టు కూడా సాధ్యమైనంత త్వరగా, ఈ విషయం పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసారు. రఘురామరాజుని వెంటనే హైకోర్టుకు పంపిస్తామని కూడా, హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే రఘురామకృష్ణం రాజుకి ఆరోగ్యపరమైన చర్యలు అవసరం అని, ఆయనకు మూడు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగిందని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించామని, రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాది కోర్టుని కోరారు.

rrr 1505222 2

దీంతో ఆయన ఆరోగ్యం విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆర్డర్ కూడా వెంటనే ఇస్తామని చెప్పారు. ఆయన్ను ఈ రోజు రిమాండ్ కు తరలించిన పక్షంలో, రేపు సిఐడి కోర్టులో, బెయిల్ పిటీషన్ దాఖలు అయ్యే అవకాసం కనిపిస్తుంది. అయితే బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా, విచారణ ప్రారంభం అయిన వెంటనే, కింద కోర్టుకు వెళ్ళకుండా ఇక్కడకు ఎందుకు బెయిల్ కోసం వచ్చారని ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇస్తూ, అరెస్ట్ చేసిన వ్యక్తి ఎంపీ అని, ప్రజాప్రతినిధిని సహేతుక కారణాలు లేకుండా అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు అని, హైకోర్టుకు తెలిపారు. అలాగే ఎఫ్ఐఆర్ లో కూడా సరైన సహేతుక కారణాలు లేవని, అలాంటిది కేవలం అభియోగాలు మోపి, ఎంపీని అరెస్ట్ ఎలా చేస్తారని కోర్టుకు తెలిపారు. అలాగే ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదని చెప్తూ, ఈ కారణాలతోనే, రిమాండ్ వేయక ముందే, బెయిల్ కోసం హైకోర్టు కు రావటం జరిగిందని, కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు ఈ వదనను అంగీకరించలేదు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రకారం,ముందుగా కింద కోర్టుకు వెళ్ళాలని సూచించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read