నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు పై, సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొద్ది సేపటి క్రితం బహిర్గతం అయ్యింది. రఘురామకృష్ణం రాజు పై, నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇందులో 124ఏ, 153ఏ, 505 r/w 120 బి కింద ఈ కేసులు నమోదు చేసారు. అయితే ఈ కేసులో ఆశ్చర్యకరంగా రఘురామకృష్ణం రాజుతో పాటు, టీవీ5, అలాగే ఏబిఎన్ చానెల్స్ పేర్లు కూడా కలిపారు. వీరందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు అని చెప్పి, ముగ్గురి పై కూడా కేసు నమోదు చేసినట్టు, ఎఫ్ఐఆర్ లో ఉంది. ఇక అదే విధంగా రాష్ట్రంలో రెండు వర్గాలకు వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టే విధంగా, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసి, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చటానికి, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, టీవీ5, అలాగే ఏబిఎన్ చానెల్స్ లో, స్లాట్లను ముందుగానే తీసుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకి చెడు భావన కలిగించే విధంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అభియోగాలు నమోదు చేసారు. ఇదంతా కూడా ఒక పధకం ప్రకారం న్యూస్ చానల్స్ హెడ్స్ తో కలిసి, వీళ్ళు కుట్ర పన్నారని చెప్పి, ఈ కుట్రలు ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైన దురభిప్రాయం కలిగే విధంగా వ్యవహరించారని చెప్పి పేర్కొన్నారు.

rrr 15052021 2

కులం, మతం ఆధారంగా ప్రజల్లోకి విధ్వేష భావాన్ని తీసుకుని వెళ్లి, ప్రజల్లో అభిప్రాయాన్ని కలిగించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటానికి, ఒక పధకం ప్రకారం, నర్సాపురం ఎంపీ రఘురామ రాజు, ఏబిఎన్, టీవీ5తో కలిపి ఈ కుట్ర పన్నారని, ఆ ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ముఖ్యంగా రెడ్డి కులం, అలాగే క్రీస్టియన్ మతాన్ని కించపరుస్తూ, వారిని రెచ్చగొడుతూ, విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేయటం ద్వారా, ప్రభుత్వం పై కుట్ర పన్నారని, అందులో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే రఘురామకృష్ణం రాజు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు కాబట్టే ఈ కేసుని సుమోటోగా తీసుకుని, కేసు నమోదు చేసామని అన్నారు. దీనికి సంబంధించి వీడియో ఫూటేజ్ కూడా తమ దగ్గర ఉందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అందుకే రఘురామరాజు ని ఏ1గా, టీవీ5ని ఏ2గా, ఏబీఎన్ ని ఏ3గా చేర్చామని ఎఫ్ఐఆర్ లో తెలిపారు. ప్రాధమిన విచారణ, లభించిన ప్రధమిక సాక్ష్యధారాలతో, ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఏకంగా టీవీ చానల్స్ ని కూడా ఈ కేసులో చేర్చటం, ఆసక్తికర అంశం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read