రఘురామకృష్ణం రాజు కేసులు ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఉదయం హైకోర్టు హౌస్ మోషన్ పిటీషన్ డిస్మిస్ చేసి, ముందుగా సిఐడి కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పటంతో, ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన్ను గుంటూరులో ఉన్న ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది ముందు హాజరుపరిచారు. అయితే ఈ సందర్భంగా పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. సిఐడి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని, ఒక ఎంపి పై ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ ఇలాగేనా అంటూ జడ్జి అభ్యంతరం తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ ని తిప్పి పంపించారు. సరి చేసుకుని రావాలని సిఐడిని ఆదేశించారు. దీంతో సిఐడి పోలీసులు హుటాహుటిన సిఐడి ఆఫీస్ కు పరుగులు పెట్టారు. అక్కడకు వెళ్లి రిమాండ్ రిపోర్ట్ ని సరి చేసి, మళ్ళీ జడ్జి ముందు పెట్టనున్నారు. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ పై జడ్జి ఏమి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది. ఇది ఇలా ఉంటే, పోలీసులు ఓవర్ ఆక్షన్ చేస్తున్నారు అంటూ, అక్కడ న్యాయవాదులు నిరసన తెలిపారు. కోర్టులో పోలీసులు పెత్తనం ఏమిటి అంటూ ఎదురు తిరిగారు. తమ క్లైంట్ ని కోర్టులో కలుసుకోవటానికి ఎవరి అనుమతి అవసరం లేదు అంటూ, ఎదురు తిరిగారు. దీంతో అక్కడ కొంచెం సేపు టెన్షన్ నెలకొంది.

r 15052021 2

ఇది ఇలా ఉంటే రఘురామకృష్ణం రాజు ని పోలీసులు కొ-ట్ట-టం, ఆ దె-బ్బ-లు కాళ్ళ మీద స్పష్టంగా కనిపిస్తూ ఉండటం, కందిపోయి ఉండటంతో, రఘురామరాజు ఆ గా-యా-ల-ను జడ్జికి చూపించారు. అంతే కాదు, పోలీసులు పై లిఖిత పుర్విక ఫిర్యాదు కూడా చేసారు. దీంతో ఈ విషయంలో కూడా ఏమి అవుతుంది, జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇలా ఇలా ఉంటే రఘురామరాజు తరుపు న్యాయావాదులు రెండు పిటీషన్లు వేసారు. ఒకటి ఆయనకు తగిలిన గా-యా-ల పై, వెంటనే హాస్పిటల్ కు తరలించాలని, దీంతో కోర్టు వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని కోరారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాలని కోరగా, రఘురామరాజు న్యాయవాదులు తమకు ప్రభుత్వం పై నమ్మకం లేదని, ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని కోరగా, కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక మరో పక్క, వెంటనే రఘురామ రాజు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ కూడా దాఖలు చేసారు. వీటి అన్నిటి పై ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read