అనూహ్య పరిణామాల మధ్య నిన్న భీమవరం వెళ్ళాల్సిన రఘురామకృష్ణం రాజు, భీమవరంలో తన అభిమానులను అరెస్ట్ చేసి వేధించటం, అలాగే ట్రైన్ లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఫాలో అవ్వటంతో, పర్యటన రద్దు చేసుకుని, తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి రఘురామరాజు ఇంటి చుట్టూ ఏపి నిఘా విభాగం అధికారులు, ఆయన ఇంటి సమీపంలో నిఘా పెట్టారు. అయితే ఈ రోజు ఆయన ఇంటి ముందు చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో, అందులో ఒకతను ఫోటోలు తీస్తూ ఉండటంతో, రఘురామరాజు సెక్యూరిటీ సిబ్బంది, అతన్ని అదుపులోకి తీసున్నారు. అయితే అతను ఎవరు అని ఆరా తీయగా అతను తాను పోలీస్ అని చెప్తున్నాడు కానీ, ఐడి కార్డు అడుగుతుంటే మాత్రం, తాను ఏ కార్డు కూడా చూపించలేక పోతున్నాడు. అయితే ఆ పట్టుకున్న వ్యక్తి మాత్రం, ఏ మాత్రం పోలీస్ ఆధికారి లాగా కనిపించటం లేదు. దీంతో రఘురామరాజు బృందం, తనను అటాక్ చేయటానికి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. తనను అంతమొందించెందుకే ఈ వ్యక్తి పన్నాగం పన్నాడని రఘురామ అనుమానిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని రఘురామ సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. అతన్ని మరింత విచారణ చేసిన తరువాత, అతన్ని లోకల్ పోలీసులకు అప్పగించే అనుమానం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read