నర్సాపురం ఎంపీ రఘురామరాజుని కొద్ది సేపటి క్రిందట సిఐడి కోర్టులో న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. అయితే ఆయనకు రిమాండ్ వేస్తారా లేదా అనేది, కొద్ది సేపట్లో తేలిపోనుంది. ఇప్పటికే కోర్టు సమయం అయిపొయింది కాబట్టి, ఈ రోజు ఇక బెయిల్ పిటీషన్ వేయటం కుదరదు. మళ్ళీ సోమవారం వారకు బెయిల్ పిటీషన్ వేసే అవకాసం లేదు. ఇది ఇలా ఉంటే రఘురామకృష్ణం రాజు కాళ్ళకు గా-యా-లు అయ్యాయి. పోలీసులు కొ-ట్టా-రంటూ, రఘురామకృష్ణం రాజు, లిఖిత పూర్వకంగా న్యాయమూర్తికి ఫిర్యాదు చేసారు. దీని పై న్యాయవాదులు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక మరో పక్క ఈ రోజు ఉదయం రఘురామరాజు హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా, సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారం ముందుగా కింద కోర్టులో అపీల్ చేసిన తరువాత, ఇక్కడకు రావాలని, సిఐడి కోర్టు తొందరగా తేల్చాలి అని, రఘురామరాజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read