ఆంధ్రప్రదేశ్ సిబిసిఐడి, ఏడీజీగా ఉన్న సునీల్ కుమార్ కు ఉచ్చు బిగుస్తుంది. హిందూ మతానికి ప్రచారం చేస్తున్నారని, అలాగే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మత విద్వేషాలు ఆయన ప్రచారం చేసారని, సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా, అంబేద్కర్ మిషన్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి, ఆయన కొన్ని విరాళాలు కూడా విదేశాల నుంచి తీసుకుని వచ్చారని, వీటి పైన వెంటనే కేసు నమోదు చేసి, ఆయన పై దర్యాప్తు చేయాలి అంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు ఢిల్లీలో ఉన్న పార్లమెంట్‍ స్ట్రీట్‍లోని పోలీస్ స్టేషన్ లో, రఘురామరాజు చేసారు. ఆ ఫిర్యాదుతో పాటుగా, డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్ కు రఘురామరాజు ఫిర్యాదు చేసారు. మంత్రి జితేంద్రసింగ్ కు రాసిన లేఖలో సునీల్ కుమార్ అంశం ఉండటం, ఆయన ఐపీఎస్ కాబట్టి, ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటే, అది తమ పరిధిలో అంశం కాదు కాబట్టి, ఇలాంటి విషయాల్లో ఐపీఎస్ ల పై చర్యలు తీసుకోవాలి అంటే కేంద్ర హోంశాఖ మాత్రమే తీసుకోగలదని, రఘురామకృష్ణం రాజుకి చెప్పి, ఆయన ఇచ్చిన ఫిర్యాదుని, కేంద్ర హోం శాఖకు పంపించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, అజయ్ బాల్లాకు పంపించారు. ఇదే విషయం మంత్రి జితేంద్రసింగ్, ఎంపీ రఘురామకృష్ణం రాజుకు లేఖ ద్వారా తెలియ చేసారు.

sunil 26072021 2

రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు, అయన ఇచ్చిన పూర్తి ఆధారాలు, రఘురామరాజు ఇచ్చిన పెన్ డ్రైవ్ అన్నీ కూడా కేంద్ర హోం శాఖకు పంపించారు. ఆ పెన్ డ్రైవ్ లో, సునీల్ కుమార్ చేసిన, మత విద్వేషానికి సంబంధించిన ప్రసంగాలు ఉన్నట్టు, రఘురామరాజు చెప్పారు. మొత్తానికి ఈ అంశం, ఇప్పుడు కేంద్ర హోంశాఖకు చేరింది. గతంలో ఇదే విషయం పై, ఒక సంస్థ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో సునీల్ కుమార్, ఆ వీడియోలు అన్నీ ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేసారు. అయితే అప్పటికే ఆ వీడియోలు అన్నీ ఆ సంస్థ సేకరించింది. దీంతో అవన్నీ మళ్ళీ కేంద్రానికి ఇచ్చారు. దీని పై విచారణ చేసి ఇవ్వాల్సిందిగా, చీఫ్ సెక్రటరీని కేంద్రం ఆదేశించింది. ఆ వివరాలు ఏమిటో ఇంకా బయటకు రాలేదు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు మళ్ళీ రఘురామరాజు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటమే కాకుండా, కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసారు. ఇప్పుడు ఈ అంశం కేంద్ర హోం శాఖ పరిధిలో ఉండటంతో, ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read