ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి, మొదటి ఏడాదిలోనే దెబ్బ పడింది, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లు ఎత్తి చూపటంతో. తమ పై విమర్శలు చేస్తే, ప్రతిపక్షాల పైనే ఎదురు తిరిగే అధికార పార్టీ నేతలు, సొంత పార్టీ నేతలను వదిలిపెడతారా ? లేదు కదా. కానీ రఘురామరాజు మాత్రం, వన్ మ్యాన్ ఆర్మీ లాగా, సొంత ప్రభుత్వం పై పోరాడుతూనే ఉన్నారు. రచ్చబండలు పేరుతో, ప్రభుత్వాన్ని చాకిరేవు పెడుతున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు ను ఇబ్బంది పెట్టటానికి, ఎప్పుడు దొరుకుతారా అని, అధికార పార్టీ నేతలు ఎదురు చూస్తున్న క్రమంలో, రఘురామకృష్ణం రాజు, తన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు ఆయన తన నియోజకవర్గంలో పర్యటన చేద్దామని అనుకున్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన మంత్రి, కొంత మంది నాయకులు, తన పర్యటనను అడ్డుకుంటానికి స్కెచ్ వేసారని, ఈ క్రమంలో ఏదైనా ఘర్షణ జరిగితే, తన పై కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.

rrr 260222021 2

దీనికి సంబంధించి, జరిగిన విషయం చెప్పటానికి సియం ఆఫీస్ కు ఫోన్ చేసానని, జగన్ తో మాట్లాడాలని చెప్పినా, గత 24 గంటలుగా తనకు వీలు పడలేదని, ఒక ఎంపీ 24 గంటలుగా ప్రయత్నం చేసినా, సియం అందుబాటులోకి రాలేదు అంటూ, జగన్ వైఖరి పై రఘురామరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న, ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడానికి ప్రయత్నం చేసినా వీలు పడలేదని రఘురామరాజు అన్నారు. ఎంపీగా ఉన్న తనను, తన నియోజకవర్గానికి వెళ్ళనివ్వటం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని రఘురామరాజు అన్నారు. తన పై అక్రమ కేసులు పెడుతున్న వారిలో, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి రంగనాథరాజు ఉన్నారని, ఐజికి ఫోన్ చేసి మరీ, ఎలాగైనా తన పై కేసు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని రఘురామ రాజు అన్నారు. ఒక ఎంపీ పై ఇంత కుట్ర పన్నుతుంటే, మా ముఖ్యమంత్రికి తెలియదు ఏమో అని, ఆయనకు ఫోన్ చేసి చెప్దాం అంటే, రెండు రోజులు నుంచి ఆయనతో మాట్లాడటం కుదరటం లేదని రఘురామరాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read