భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌ని తిర‌గ‌రాసింది ఆర్ఆర్ఆర్. వైకాపా కోట‌లో క‌ల‌వ‌రం పుట్టిస్తోంది మ‌రో ఆర్ఆర్ఆర్. ఆయ‌నే వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘు రామ‌కృష్ణం రాజు. వైసీపీ టికెట్ పై న‌ర్సాపురం ఎంపీగా గెలిచినా.. త‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించి వైకాపా అధినేత‌కి శ‌త్రువుగా మారారు. ర‌ఘురామ‌కృష్ణంరాజుని కొట్టించారు. అరెస్ట్ చేయించారు. నియోజ‌క‌వ‌ర్గానికి రాకుండా కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆర్ఆర్ఆర్ అంటే భ‌య‌ప‌డుతూనే ఉన్నారు వైకాపా పెద్ద‌లు.
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. న‌ర్సాపురంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడించ‌డ‌మే త‌మ ముందున్న క‌ర్త‌వ్యం అనే రేంజులో వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇటీవ‌లే క‌న్నుమూశారు. న‌ర్సాపురం ప్రాంతీయులు-క్ష‌త్రియులు కావ‌డం, వారి సినీవార‌సుడు ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ కావ‌డంతో ర‌ఘురామ‌కృష్ణంరాజుని ఎదుర్కొనేందుకు రెబ‌ల్ స్టార్ కార్డు వాడాల‌ని వైకాపా డిసైడ్ అయ్యింద‌ని స‌మాచారం.
నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల దేవిని బ‌రిలో దింపాల‌ని వైసీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రెబ‌ల్ స్టార్ ఫ్యామిలీతో చ‌ర్చ‌లు జ‌రిపార‌నే స‌మాచారం గుప్పుమంది. ప్ర‌భాస్ ఇమేజ్, న‌ర్సాపురంలో రెబ‌ల్ స్టార్ ఇమేజ్ క‌లిసి వ‌చ్చి ర‌ఘురామ‌కృష్ణంరాజుని ఈజీగా ఓడించేయ‌వ‌చ్చ‌ని వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ల ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read