తన లేఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను వివిధ కేంద్ర మంత్రులకు, ఎంపీలకు తెలియ చేస్తూ వస్తున్న రఘురామకృష్ణం రాజు, ఈ రోజు స్వయంగా జగన్ మోహన్ రెడ్డికే లేఖ రాసారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న వేళ, ఈ లేఖ రాయటం, అది చర్చ అయితే, రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో, ఆయన ఈ పని చేసి ఉంటారు. ఇప్పటి వరకు ఫిర్యాదు లేఖలు రాసిన రఘురామరాజు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉండగా, ఇచ్చిన ప్రాధాన హామీ అయిన, వృద్ధాప్య పెన్షన్లు విషయం పై రఘురామరాజు లేఖ రాసారు. రెండు వేల నుంచి మూడు వేల వరకు పెన్షన్ పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని అన్నారు. కేవలం 250 రూపాయలు పెంచారని అన్నారు. తరువాత ఏడాదికి 250 రూపాయలు పెంచుతామని చెప్పారని, ఇప్పటికి రెండేళ్ళు దాటి మూడో ఏడు వచ్చిందని, 2750 రూపాయాలు పెంచాల్సి ఉండగా, ఇప్పటి కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారని అన్నారు. తక్షణం పెన్షన్ పెంచాలి అంటూ, తన లేఖలో తెలిపారు. వృద్ధులు అందరూ కూడా దేవుళ్ళతో సమానం అని, వాళ్ళకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని, మాట తప్పవద్దు అంటూ లేఖలో తెలిపారు.

rrr 10062021 2

అయితే ఈ లేఖ రాసిన సమయం మాత్రం, ఆసక్తిగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం ఇవ్వాల్సిన హామీల కోసం జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వైసీపీ చెప్తుంటే, ముందు మీరు ఇచ్చిన హామీ గురించి చెప్పండి అంటూ, రఘురామరాజు లేఖ రాసి, దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టారు. రాజకీయంగా ఆడుతున్న మైండ్ గేంలో భాగంగా, రఘురామరాజు ఈ అస్త్రం వదిలారు. నిన్నటి వరకు అందరికీ జగన్ పై లేఖలు రాసిన రఘురామరాజు, ఈ రోజు జగన్ కే లేఖ రాసి, అదీ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇది చర్చకు పెట్టారు. రఘురామరాజు వ్యూహం చూస్తే, ఇక నుంచి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పిన ప్రతి అంశం పై, రఘురామరాజు ఇలా లేఖలు రాసి, చర్చకు పెట్టే అవకాసం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రఘురామరాజు రాసిన లేఖ పై జగన్ స్పందిస్తారా , లేక వైసీపీ నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి రఘురామరాజు రోజుకి ఒక కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read