ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు ఎడాపెడా చార్జీలు పెంచేసి, సామాన్యుల నడ్డి విరగ్గోడుతున్నారు అంటూ, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, పాదయాత్రలో ఊరు ఊరు తిరుగుతూ, చెప్పిన మాట ఇది. నిజానికి చంద్రబాబు, 5 ఏళ్ళ కాలంలో, కేవలం 2015లో, 5 పైసల వరకు ఆర్టీసీ చార్జీలు పెంచారు, అలాగే కరెంటు చార్జీలు అసలు పెంచనే లేదు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, కేవలం ఆరు నెలల్లోనే, ఆర్టీసీ చార్జీలు పెంచేసి, ప్రజలకు షాక్ ఇచ్చారు. ఆరు నెలల సందర్భంగా, ప్రజలకు గిఫ్ట్ ఇస్తున్నాం అన్నట్టు, చార్జీలు పెంచేసారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసులకు కిలోమీటర్‌కు 10 పైసలు చొప్పున, మిగతా అన్ని సర్వీసులకు కిలోమీటర్‌కు రూ. 20 పైసలు చొప్పున పెంచుతున్నట్లు మంత్రి పెర్ని నాని ప్రకటించారు. అయితే ఈ చార్జీలు ఎప్పటి నుంచి అమలు లోకి వస్తాయి అనేది త్వరలోనే చెప్తాం అని, ఆర్టీసీ ఎండీ, త్వరలోనే ముందుకు వచ్చి, వివరాలు చేప్తరాని చెప్పారు.

jagan 07122019 1 1 2

ఆర్టీసీ నష్టాల్లో ఉందని, అందుకే ఛార్జీలు పెంచక తప్పట్లేదని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. అయితే, ఆర్టీసి ఛార్జీల పెంపు పైటిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనలో వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. " పల్లెవెలుగు, సిటి సర్వీసులు కిమీ కు 10పైసలు, మిగిలిన వాటిపై కిమీ కు 20పైసలు పెంచడాన్ని ఖండించిన అచ్చెన్నాయుడు. సీఎం ఆమోదించారని మంత్రి పేర్ని నాని చెప్పడం ప్రజలను వంచించడమే. ప్రజలపై పైసా భారం వేయనని పాదయాత్రలో జగన్ చెప్పారు. పన్నులు, ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలను నమ్మించారు. 6నెలల్లోనే ఆర్టీసి ఛార్జీలు పెంచడం ప్రజలను మోసగించడమే. జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మరోసారి రుజువైంది. ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయం జగన్ చేతగానితనానికి నిదర్శనం. ఆర్టీసి రూ.1200కోట్ల నష్టాలలో ఉందని చెప్పడం హాస్యాస్పదం. టిడిపి 5ఏళ్ల పాలనలో పేదలపై భారం మోపలేదు. భారాలు వేయకుండానే ఆర్టీసిని బలోపేతానికి చర్యలు చేపట్టాం. బస్సులు కొనడానికి భారీగా నిధులు ఇచ్చాం. ఆర్టీసి కార్మికులకు 42% ఫిట్ మెంట్ ఇచ్చినా ప్రజలపై భారం వేయలేదు."

jagan 07122019 1 1 3

"రూ.16వేల కోట్ల ఆర్ధికలోటులో కూడా ప్రజలపై భారాలు వేయని ఘనత టిడిపిదే. కరెంటు ఛార్జీలు,ఆర్టీసి ఛార్జీలు పెంచేది లేదని చెప్పాం, ఆచరించి చూపించాం. అలాంటిది వైసిపి ప్రభుత్వం పేదలను దారుణంగా మోసగించింది. వైసిపి పాలనలో పవర్ ఉండదు, పవర్ ఛార్జీలు పెంచుతాం అంటారు. ఆర్టీసిలో వసతులు పెంచరు, ఛార్జీలు పెంచుతాం అంటారు. ఒకవైపు ఉల్లి ధరలు విపరీతంగా పెంచేశారు. మరోవైపు ఆర్టీసి ఛార్జీలు పెంచుతున్నారు. సామాన్యుడి నడ్డి విరగ్గొట్టడమే వైసిపి ధ్యేయంగా పెట్టుకుంది. ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం. టిడిపి వెల్ఫేర్ స్కీమ్ లు అనేకం రద్దు చేసింది. ఆదరణ 2, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఫుడ్ బాస్కెట్ అన్నీ రద్దు చేసింది. వైసిపి తెచ్చిన పథకాల్లో అన్నీ ఆంక్షలు, కోతలు పెట్టింది. పేదల సంక్షేమాన్ని కాలరాయడమే ధ్యేయంగా సీఎం జగన్ వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. సంక్షేమం ముసుగులో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. రాష్ట్రాన్నే ఏకంగా అమ్మేయాలని చూస్తున్నారు. వీటన్నింటికి తగిన మూల్యం చెల్లించక తప్పదు" అంటూ అచ్చెన్నాయుడు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read