రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాల భద్రత కావాలి అంటూ కేంద్రానికి లేఖ రాసిన లేఖ పై నిన్నటి నుంచి క్లారిటీ లేదు. రమేష్ కుమార్ ఈ విషయం పై స్పందించక పోవటంతో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకున్నారు. అయితే, ఈ లేఖ వాస్తవమేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం కింద, నీరజ్‌కుమార్ అనే ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు, కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. లేఖ మీద ఏ చర్యలు తీసుకుంది, వ్యక్తిగతంగా పోస్టులో పంపుతున్నట్టు హోంశాఖ తెలిపింది. హోంశాఖ స్పందనను నీరజ్‌కుమార్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే ఇదే విషయం ఈ రోజు చంద్రబాబు ప్రెస్ మీట్ లో కూడా చదివి వినిపించారు. ఆయన ఏమన్నారంటే, ‘‘ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా బాధ్యతగా ప్రవర్తించడం లేదు. ప్రపంచం మొత్తం కరోనా నియంత్రణపై దృష్టి పెడితే, దేశాధినేతలు, అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు కూడా కరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలని ఆలోచిస్తుంటే, ఈ ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్షాలపై, రాజ్యాంగ వ్యవస్థలపై ఏవిధంగా బురద జల్లాలా అని ఆలోచిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. డిజిపి దగ్గరకు వెళ్లిన 7గురు వైసిపి ఎమ్మెల్యేలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన స్థాయిని పూర్తిగా దిగజార్చేలా కమిషన్ ఉంది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, హైకోర్ట్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తి ఉపయోగించే పదజాలం కాకుండా, రాజకీయశత్రువులు కుట్రదారులు వాడే పదజాలంతో లేఖ రాశారని మాట్లాడారని అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ, జాతీయ మీడియా, కొంతమంది మీడియా చేస్తున్నారని వాళ్లు ఆరోపించడం దుర్మార్గం, దీనిని మేము ఖండిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి, వైసిపి ప్రతిష్టకు భంగం కలిగించే పరిణామం అనడం హాస్యాస్పదం. ఎన్నికల సంఘం కేంద్ర హోంమంత్రికి పంపిన వినతిని వేరే పార్టీలు రాసినట్లుగా చిత్రించడం కంటే దౌర్భాగ్యం మరోకటిలేదు. "

"ఇది ఈసి రాశారా, ఎవరు రాశారు, రాజకీయాలు ఎందుకు రాశారు, ఎవరు రాశారో చెప్పాలి కదా అంటూ ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ లేఖ ఎవరు రాశారనేది తెలుసుకోడానికి నీరజ్ కుమార్ గూడపాటి అనే వ్యక్తి ఆర్టీఐకింద కేంద్ర హోం శాఖకు మార్చిన 18న లేఖ పంపినట్లుగా అది అందిందని, దానిని సంబంధిత శాఖకు పంపామని ఈ రోజు కేంద్ర అధికారులే నిర్దారించారు. నిన్నటినుంచి ఈసి దీనిపై మాట్లాడలేదు, ఒకవేళ ఇది వాస్తవం కాకపోతే ఎప్పుడో మాట్లాడేవారు. దీనిని చూసైనా వీళ్లకు సిగ్గు అనిపించాలి. ఇది వాస్తవం కాకపోతే ఎప్పుడో ఖండించేవారు. ఇప్పటికే కేంద్రం నుంచి సిఆర్ పిఎఫ్ బలగాలు వాళ్ల ఆఫీసుకు వచ్చాయి. రాజ్యాంగ వ్యవస్థ అధిపతి, ఒక హైకోర్ట్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తి, ‘నాకు ప్రా-ణ-హా-ని ఉంది, నా కుటుంబ సభ్యులకు భద్రత లేదు, నేను స్వేచ్ఛగా విధులు నిర్వహించాలంటే నాకు భద్రత ఉంటే తప్ప విధులు నిర్వహించలేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ 2/2020 కూడా డ్రెకోనియన్(కిరాతక) ఆర్డినెన్స్ అని చెప్పారు. వాళ్ల ఇళ్లలో మద్యం, నగదు దొరికితే ఎన్నికల్లో గెలిచినవారిని అనర్హులను చేయవచ్చు, తమను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని ప్రతిపక్షాలు పేర్కొన్నాయని, అంటూ వారి వాదనకు బలం చేకూర్చేలా, అధికార పార్టీ వాళ్లు ప్రతిపక్ష అభ్యర్ధుల, నాయకుల ఇళ్లలో మద్యం సీసాలు పెట్టి పోలీసులను పంపి అరెస్ట్ చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని రాశారు. "

"అదే మేము చెప్పాం ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడే...మేము చెప్పిందే జరిగింది తరువాత కూడా. తెనాలిలో అర్ధరాత్రి మా అభ్యర్ధి ఇంట్లోకి దొంగల్లాగా వెళ్లి వాటర్ ట్యాంక్ పక్కన మద్యం సీసాలు పెట్టి, పోలీసులను పిలిపించి ఏవిధంగా టిడిపి అభ్యర్ధిపై కేసులు పెట్టారో రుజువు చేశాం. అది కాదని చెప్పే ధైర్యం వైసిపి వాళ్లకు ఉందా..? సిగ్గుందా వీళ్లకు అసలు. ఎన్నికల వాయిదాపై ఈసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ చర్యలనే సమర్ధించింది, కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మాత్రం ఎత్తేయాలని సూచించింది, తదుపరి విడత ఎన్నికలోనైనా ఉల్లంఘనలను అడ్డుకుని ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఆ లక్ష్యం అందని ద్రాక్షే అని ఆయన ఆ లేఖలో చెప్పారు. ఈ నేపథ్యంలో నాకు నా కుటుంబానికి భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నాను. ఈ సమయంలో నేను హైదరాబాద్ లో ఉండటమే కొంత సురక్షితం, అలాగని పూర్తిగా కాదు. నా శ్రేయోభిలాషులు, నాతో కలిసి పనిచేసేవారు భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారు నన్ను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా భౌ-తి-క-దా-డు-లు చేస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుత పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహన వైఖరి, ప్ర-తీ-కా-రే-చ్ఛ-ల-ను పరిగణలోకి తీసుకుని నాకు , నా కుటుంబ సభ్యులకు ఆపద ఏర్పడిందని ఆందోళన చెందుతున్నానని ఆ లేఖలో రాశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖను శరణు కోరడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదంటూ, ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల వారి అనుయాయులు, నేరగాళ్లు నాపై దాడికి సిద్ధంగా ఉన్నారు, వారి నేరచరిత్రను దృష్టిలో ఉంచుకునే ఈ బాధాకరమైన అభిప్రాయానికి వచ్చానని ఆయన రాస్తే ఆయనకు ఈరోజు బలగాలతో భద్రత కల్పిస్తే మీ ఇష్టం వచ్చినట్లు అంటారా..?" అంటూ చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read