ఈ రోజు మెగా స్టార్ చిరంజీవిని, జగన్ మోహన్ రెడ్డి పిలిచారని, జగన్ తో లంచ్ మీటింగ్ ఉంటుంది అంటూ, ఉదయం నుంచి వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఈ భేటీ పై రాజకీయ చర్చ కూడా జరుగుతుంది. చిరంజీవి కొద్ది రోజుల క్రితమే, నాకు సినీ పెద్ద అనే హోదా వద్దు అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తరువాత మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ లాంటి జగన్ సన్నిహితులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ లోపే మళ్ళీ చిరంజీవిని పిలిపించటం వెనుక, ఏమి ఉంది అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం, రెండు రోజుల క్రిందట చంద్రబాబు చేసిన వ్యాఖ్యలుగా చెప్తున్నారు. చంద్రబాబు రెండు రోజుల క్రిందట మాట్లాడుతూ, చిరంజీవి నాకు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ సన్నిహితుడే అని, ఆయన పార్టీ వల్ల నేను ఓడిపోయినా, ఎప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, చిరంజీవికి కబురు రావటం పై చర్చ జరుగుతుంది. ఈ సినిమా వివాదం లేక ముందు కూడా, చిరంజీవితో జగన్ భేటీ అయ్యారు. రాజకీయంగా ఇద్దరూ ఒక్కటి అయ్యే అవకాసం ఉందని, చిరంజీవికి రాజ్యసభ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టాలి అంటే, చిరంజీవిని తన వైపు తిప్పుకోవటానికి, ఇదే మార్గం అని జగన్ భావించినట్టు ప్రచారం జరిగింది.

chiru 13012022 2

తరువాత సినిమా వివాదం వచ్చిన తరువాత, చిరంజీవి గత ఆరు నెలలుగా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న, పేర్ని నాని మధ్యలోకి వస్తున్నారు కానీ, జగన్ మాత్రం చిరంజీవికి అందుబాటులోకి రాలేదు. ఆ తరువాత, సిని పెద్దగా నేను ఉండను అని చిరంజీవి తేల్చి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ జగన్ నుంచి పిలుపు రావటంతో, చిరంజీవి వస్తున్నారు. ఇద్దరూ కలిసి లంచ్ చేసేది, దేని కోసం అనే చర్చ జరుగుతుంది. సినిమా ఇష్యూ కి ఫుల్ స్టాప్ పెడతారా ? లేక ఇది రాజకీయ మీటింగా అనేది కూడా తేలాలి. సినిమా టికెట్ల విషయంలో అయితే, చిరంజీవి ఒక్కడినే ఎందుకు రమ్మంటారు ? చిరంజీవిని సినీ పరిశ్రమ ప్రతినిధిగా పంపించిందా అంటే అదీ లేదు. మరి ఈ భేటీ ఏమిటి, దేని కోసం అనేది అయితే చూడాలి. వచ్చే ఎన్నికల్లో కాపులు, తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారని, జనసేన కూడా టిడిపితో కలిస్తే, ఇక తమ పని అయిపోయినట్టే అని వైసీపీ భావిస్తున్న ఈ తరుణంలో, చిరంజీవి ద్వారా ఆ కాపు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చే రాజకీయ క్రీడ ఏమైనా ప్లాన్ చేసారా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read