అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతిని మూడు ముక్కలు చేసే విషయంలో జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ సహకారం ఉందని, జనసేన పార్టీ ఏమి మాట్లాడటం లేదు అని అందరూ, జగన్, మోడీ, పవన్ ని విమర్శిస్తున్నారని, వాళ్ళను ఒక పక్కన పెడితే, మరో ముఖ్యమైన వ్యక్తి గురించి అందరూ మర్చిపోయారని, ఆ వ్యక్తి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అమరావతిని చంపేయటంలో కేసీఆర్ ది కీలక పాత్ర అని నేను నుమ్ముతానని సబ్బం హరి అన్నారు. తనకు చాలా దగ్గర మనుషులు చెప్పిన విషయం ప్రకారం, కేసీఆర్ ఆదేశాల మేరకే, జగన్ మోహన్ రెడ్డి అమరావతిని చంపేయటం మొదలు పెట్టారని, దీని పై తన దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని సబ్భం హరి సంచలన వ్యాఖ్యలు చేసారు.

అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, ఇక్కడ జగన్ నిర్ణయం తీసుకోగానే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుందని, ఇక్కడ రేట్లు పడిపోయాయని అన్నారు. ఈ నిర్ణయం పై కేసీఆర్ ఎంతో ఖుషీగా ఉన్నారని అన్నారు. అమరావతిని చంపేస్తే, హైదరాబాద్ లో ఉన్న మీ ఆస్తులు విలువ రెట్టింపు అవుతుందని, జగన్ తో కేసీఆర్ అన్నట్టు, తనకు ఒక వ్యక్తి చెప్పారని సబ్భం హరి అన్నారు. కష్టపడి అందరం కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమన్నారు, సరే మన బ్రతుకు ఏదో మనం బ్రతుకుదాం అని ఇక్కడకు వచ్చి, అమరావతి నిర్మాణం చేసుకుంటే, మన బ్రతుకులు మీద మళ్ళీ మళ్ళీ కొడుతున్నారని, అటు హైదరాబాద్ లేక, ఇటు అమరావతి లేక, నాశనం చేసారని అనంరు. వైసీపీ, బీజేపీ, జనసేనతో పాటుగా, కేసిఆర్ ని , ఈ విషయంలో మర్చిపో కూడదు అని, చేసిన నష్టం మొత్తం ఆయనే అంటూ, సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read