మాజీ ఎంపీ సబ్బంహరి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి, స్పీకర్ తమ్మినేని పై ఫైర్ అయ్యారు. నిన్న స్పీకర్ తమ్మినేని తిరుమలలో, న్యాయస్థానాల పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల జోక్యం ఎక్కువ అయ్యిందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలు, కాదనే హక్కు కోర్టులకు లేదని, వాళ్ళే అక్కడ నుంచి పాలించుకోవచ్చు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని పై అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు ఎదురు అవుతున్న సమయంలో, మాజీ ఎంపీ సబ్బం హరి మీడియా సమావేశం పెట్టారు. స్పీకర్ వైఖరి పై అభ్యంతరం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, "దేశంలో ఎక్కడా లేనిది ఏపీలోనే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? 30 ఏళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కోర్టు తప్పించి వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. కోర్టుకు ఏపీ ప్రభుత్వం ఎందుకు వెళ్లిందో తెలియదా?. ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని ఎవరూ అనడం లేదు. రాజధాని కోసం రైతులు త్యాగాలు చేస్తే.. అది శ్మశానం అన్నారు. వేలాది ఎకరాలు ఇచ్చిన వారికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లకూడదా? హక్కులను కోల్పోతున్న ప్రజలు కోర్టుకు వెళ్లడం తప్పా. ఏపీలో మాత్రమే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేశారు. వీటన్నిటిపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. "

"అక్కడ జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్పీకర్ తమ్మినేని తనపని తాను చేస్తే సరిపోతుంది. అసెంబ్లీ వరకు మాత్రమే స్పీకర్‌కు అధికారాలు ఉంటాయి. కోర్టుల తీర్పులపై వ్యాఖ్యలు చేయడం స్పీకర్‌కు తగదు. కోర్టులను బ్లాక్ మెయిల్ చేసేలా స్పీకర్ వ్యాఖ్యలు. లా చదివినంత మాత్రాన తమ్మినేనికి అంతా తెలిసినట్టు కాదు. స్పీకర్ తన పరిధి తెలుసుకుని మాట్లాడాలి. పదే పదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. తమ్మినేని రాజ్యాంగ శక్తిగా భావిస్తే తప్పు చేయడమే. చాలా మేధావి అనుకుని మాట్లాడటం తప్పు. కోర్టుకి అధికారం ఉంటే.. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసినా తప్పులేదు. రద్దు చేయమని నా ఉద్దేశం కాదు. కోర్టులను బ్లాక్ మెయిల్ చేసేలా స్పీకర్ వ్యాఖ్యలు చేయడం తగదు. మీకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడాలనుకుంటే స్పీకర్ పదవిని వదిలేయాలి. మీ సీఎంను అడిగి మంత్రి పదవి తీసుకుని మాట్లాడాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కోర్టుకెళ్తారు. కోర్టులు ఏ పనీ చేసుకోనివ్వడం లేదనడం సరికాదు. ఈ విధంగా తమ్మినేని మాట్లాడితే.. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు" అని సబ్బం హరి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read