మొన్నటి దాకా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకను అక్రమంగా తవ్వేసి, ప్రజలను పిండేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఇసుక ఫ్రీ అంటూనే ప్రజలకు అందుబాటులో లేకుండా స్థానిక నేతలు, ఇసుకను తవ్వేసి, ఇష్టారాజ్యంగా ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, విమర్శలు గుప్పించారు. కొంత వరకు ఇది వాస్తవం కూడా. తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఒక కారణం, ఇసుకలో అక్రమాలు అని విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెడితే, అధికారం మారించి. తెలుగుదేశం ప్రతిపక్షంలోకి, వైసిపీ అధికారంలోకి వచ్చింది. కొత్త ఇసుక పాలసీ తీసుకువస్తున్నాం అని, అదని, ఇదని, ప్రజలకు అతి తక్కువ ధరకే ఇసుక వస్తుందని, ఇలా అనేక మాటలు జగన్ చెప్పారు. అయితే వాస్తవానికి అది దూరంగా ఉంది.

sand 17072019 1

తెలుగుదేశం హయంలో ట్రాక్టర్ 1500 ఉంటే, ఇప్పుడు 5 వేలు అయ్యింది. వైసిపీ స్థానిక నేతలు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. మా నియోజకవర్గంలోకి, ఎక్కడ నుంచో వచ్చిన ఎంపీ, ఇక్కడకు ఇసుకను తవ్వేస్తున్నారని, అక్రమంగా తవ్వేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే జగన్ కు ఫిర్యాదు చేసారు. ఆయన్ను అరికట్టాలని, కోరారు. గుంటూరు జిల్లా తాడికొండ పరిధిలోని, ఉద్దండరాయునిపాలెంలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. దీనికి ఒక ఎంపీ అండదండలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే స్థానిక ఎమ్మెల్యే మాత్రం, ఈ అక్రమాలు చెయ్యటానికి వీలు లేదని వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసిపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవలు మొదలయ్యాయి. రెండు వర్గాలుగా చీలిపోయారు.

sand 17072019 1

దీంతో ఈ వ్యవాహారం జగన్ దగ్గరకు చేరింది. ఎక్కడో బాపట్లలో గెలిచినా ఎంపీ, స్థానికుడిని అనే పేరు చెప్పి, ఇక్కడ తన వర్గానికి ఇష్టం వచ్చినట్టు ఇసుకను అమ్ముకోమని చెప్పారని, ఎమ్మెల్యే వాదిస్తున్నారు. మంగళవారం, ఎంపీ అనుచరులు ఇసుకను తరలిస్తూ ఉండగా, ఎమ్మెల్యే ఫిర్యాదుతో, పోలీసులు, మైనింగ్ అధికారులు దాడి చేసి, ట్రాక్టర్లు, పొక్లెయినర్‌లను సీజ్ చేసారు. అయితే విషయం తెలుసుకున్న ఎంపీ, తన అనుచరులను వదిలెయ్యాలని, సీజ్ చేసిన బళ్ళు వెంటనే వదిలెయ్యాలని, పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఎమ్మెల్యే మాత్రం, తన నియోజకవర్గంలో అక్రమాలు కుదరవు అని, పోలీసులు వీటిని అరికట్టాలని అన్నారు. దీంతో పోలీసులు ఎవరి మాట వినాలో, అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఈ వ్యవహారం జగన్ దాకా వెళ్ళటంతో, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read