ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమను, గుజరాతీ కంపెనీ చేతిలో పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలను ముంచి వేస్తూ, తీసుకున్న ఈ నిర్ణయం పై, అందరూ అభ్యంతరం చెప్తున్న వేళ, అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి, ఈ చర్యను సమర్ధించుకున్నారు. అలాగే ఈ రోజు ఒక పెద్ద పేపర్ యాడ్ ఇచ్చి, అందులో వివిధ డైరీలు చెల్లిస్తున్న రేట్లు, గుజరాతీ కంపెనీ అముల్ చెల్లించే రేట్లు గురించి, చెప్తూ ఒక పెద్ద యాడ్ వేసారు. అయితే అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి తమ కంపెనీ గురించి తప్పుడు ప్రచారం చేసారని, సంగం డైరీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంగం డైరీ వారు పాల ఉత్పత్తిదారులకు తక్కువ ధర చేల్లిస్తున్నమాని చెప్పిన మాట అవాస్తవం అని ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్ళుగా సంగం డైరీ పాల ఉత్పత్తిదారులకు ఎక్కువ ధర చెల్లిస్తుందని తెలిపారు. ఎక్కువ ధరలు చెల్లించటమే కాదని, బోనస్ కూడా ఎక్కువ ఇస్తున్నట్టు చెప్పారు.

sangam 02122020 2

దీనికి సంబంధించిన ధరల వివరాలు కూడా చెప్పారు. తాము గేద పాలుకు 46.83 రూపాయలు చెల్లిస్తున్నామని, అలాగే ఆవు పాలుకు 30.19 రూపాయలు చెల్లిస్తున్నామని, అయితే అముల్ మాత్రం గేద పాలుకు 45.48 రూపాయాలు, అలాగే ఆవు పాలుకు 28.00 రూపాయలకు చెల్లిస్తామని చెప్పారని తమ ప్రకటనలో తెలిపారు. ఇదే రేట్లతో తాము గత ఏడాది దాదాపుగా 9 కోట్లు పాల ఉత్పత్తిధారులకు చెల్లించామని అన్నారు. అలాగే ఉత్పత్తిధారులకు, పశువైద్య సేవలు, పశుదాణా కూడా సరఫరా చేసి, సబ్సిడీ పై పాడి పశువులకు బీమా ఇచ్చామని, వీటి కోసం ఏడాదికి 2.58 కోట్లు విడుదల చేసామని అన్నారు. సంగం కంటే, అముల్ వాళ్ళు 5 రూపాయాలు ఎక్కువ ఇస్తున్నారని ప్రభుత్వం ప్రకటించటం వాస్తవం కాదని అన్నారు. ఇలా మొత్తం వివరాలతో ప్రభుత్వ ప్రకటనను సంగం డైరీ ఖండించింది. మరి దీని పై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read