ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీకి తెలుగుదేశం పార్టీ మరో షాక్ ఇచ్చింది. గతంలో అమరావతి విషయంలో కూడా ఇలాగే షాక్ ఇవ్వటంతో, అధికార పక్షం గిల గిలా కొట్టుకుంది, ఏకంగా కౌన్సిల్ చైర్మెన్ షరీఫ్ గారి పై చేసిన రుబాబు తెలిసిందే. అమరావతిని మూడు ముక్కలు చేసే బిల్లులు విషయంలో, తెలుగుదేశం పార్టీ బ్రేక్ వేసింది. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించింది. అప్పుడు వేసిన బ్రేక్, ఇప్పటికీ అమరావతిని మూడు ముక్కలు చేయలేక, అధికార పక్షం విలవిలలాడుతుంది. అంతే కాదు తెలుగు మీడియం ఆప్షన్ లేకుండా, కేవలం ఇంగ్లీష్ మీడియం పెట్టటం పై కూడా బిల్లు వెనక్కు పంపించారు. ఇంగ్లీష్ మీడియం పై అభ్యంతరం లేదని, కానీ తెలుగు మీడియం అనే ఆప్షన్ కూడా ఉండాలని బిల్లు వెనక్కు పంపించారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో, అధికార పక్షం ఆటలు సాగటం లేదు. రెండో సారి మళ్ళీ అసెంబ్లీలో ఆమోదించుకు వెళ్లిపోవచ్చు కానీ, మండలిలో తెలుగుదేశం చేస్తున్న పోరాటంతో, బిల్లుల పై చర్చ జరుగుతుంది. ప్రజలకు ఏమి నష్టమో అర్ధం అవుతుంది. ఈ విధంగా అధికార పక్షానికి అన్నీ ఇబ్బందులే ఎదురు అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు తాజాగా మరో షాక్ ఇచ్చింది శాసన మండలి. అసెంబ్లీలో నిన్న ప్రజల పై భారీగా భారం పడే ఒక బిల్లుని అధికార పక్షం ఆమోదించింది. ఆ బిల్లు పై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు వాక్ అవుట్ కూడా చేసారు. ఆ బిల్లు పట్టాన ప్రాంతాల్లో ఆస్తి విలువ ఆధారంగా ఇక నుంచి పన్నులు బాదే బిల్లు.

council 02122020 2

ఈ చట్టంతో, ఇక నుంచి పన్నులు భారీగా పెరగనున్నాయి. అయితే ఇది కేవలం 10 శాతమేగా పెంచుతుంది అంటూ అధికార పక్షం ఎదురు దాడి చేస్తుంది. అయితే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుని శాసనమండలికి పంపించారు. అక్కడ ఈ బిల్లు పై జరిగిన ఓటింగ్ లో మరోసారి అధికార పక్షానికి షాక్ ఇచ్చింది ప్రతిపక్షం. తెలుగుదేశం సభ్యులతో పాటుగా,  పీడీఎఫ్ సభ్యులు ఈ బిల్లుని వ్యతిరేకించారు. అయితే బీజేపీ ఈ బిల్లుని సుపోర్ట్ చేసిందో, తటస్తంగా ఉందొ తెలియ లేదు. మొత్తంగా ఈ బిల్లు మండలిలో వీగిపోయింది. బిల్లుకు వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. అనుకూలంగా 11 ఓట్లు వచ్చాయి. అయితే ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మెన్ ను తెలుగుదేశం పార్టీ కోరనుంది. ఇలా చేస్తే ప్రజల అభిప్రాయం తెలుస్తుందని, ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితి తెలుస్తుందని తెలుగుదేశం భావన. మరి దీని పై తుదపరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే ప్రజల పై పడే భారాన్ని తెలుగుదేశం పార్టీ ఆపగలిగింది. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా మళ్ళీ రెండో సారి అసెంబ్లీలో ఆమోదిస్తే, ప్రజలకు పన్నుల షాక్ తప్పదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read