గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయంసంగా మారిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకల వివాదానికి హైకోర్టులో ఫుల్ స్టాప్ పడింది. స్వరూపానందకి ఆలయ మర్యాదలతో కూడిన కానుకులు పంపాలని చెప్పి, దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోని హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి రెండు రోజులు క్రితం శారదాపీఠం నుంచి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు ఒక లేఖ అందింది. ఆ లేఖ సారంశం ఏమిటి అంటే, ఈ నెల 18న శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఆలయ మార్యదాలు ఇవ్వాలి అనేది ఆ లేఖ సారాంశం. శారదా పీఠాధిపతిని నుంచి ఆ లేఖ అందగానే, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాలకు ఒక మెమోని జారీ చేసింది. ఆ మెమో ప్రకారం ఏమిటి అంటే, శారదా పీఠం కోరిన విధంగానే, ఆలయ మర్యాదలతో కూడిన కానుకలు శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి పంపాలి అనేది ఆ మెమో ఉద్దేశం. అయితే దేవాదాయ శాఖ ఈ విధంగా మెమో జారీ చేయటం అనేది వివాదాస్పదం అయ్యింది. దీనికి సంబంధించి పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

swaroopa 17112020 2

అయితే దీని పై కొందరు, దేవాదాయ శాఖ జారీ చేసిన మెమో ని ఛాలెంజ్ చేస్తూ, హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ రోజు ఉదయమే, హైకోర్టులో ఈ అంశం వస్తుంది అనగా, శారదా పీఠం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన సారంశం ఏమిటి అంటే, 2004 నుంచి కూడా స్వామి వారి పుట్టిన రోజు నాడు, అన్ని ఆలయాల నుంచి మర్యదాలు అందుతున్నాయి, ఈ ఏడాది కూడా అందించాలని కోరాము, ఈ అంశాల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, దాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి తగ్గట్టుగానే, ఈ అంశం హైకోర్టులో విచారణకు రాగానే, తాము దేవాదాయ శాఖకు రాసిన లేఖను వెనక్కు తీసుకుంటుంన్నామని హైకోర్టుకి తెలిపారు. దీంతో శారదా పీఠమే వెనక్కు తీసుకోవటంతో, ఇక ఈ పిటీషన్ కొట్టేస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీంతో దేవాదాయ శాఖ కూడా ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకుంది. మొత్తానికి ఈ వివాదం, మొండిగా ముందుకు వెళ్లి, హైకోర్టు ఆగ్రహానికి గురి కాకుండా, విజ్ఞతతో అలోచించి, వివాదానికి ముగింపు పలికారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read