ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రూల్ 71 మీద చర్చ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీస్ పై, ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. చర్చ రాత్రి 11 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. బిల్లుల మీద చర్చ రేపటికి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు బిల్లులు పాస్ అవుతాయా ? లేదా అనే ఉత్కంట కొనసాగుతుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే యోచనలో టీడీపీ ఉంది. సెలక్ట్ కమిటీలో నిర్ణయానికి గరిష్టంగా 3 నెలలు సమయం పట్టే ఛాన్స్ ఉంటుంది. మరో పక్క వైసీపీ మాత్రం, బిల్ ఆమోదం పొందటానికి, తన తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. మండలిలోనే విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి ఉన్నారు. గ్యాలరీలో వీళ్ళు ఉన్నారు. మరో పక్క, సవరణల కోసం బిల్లు అసెంబ్లీకి వెళ్లినా ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశం ఉంది. మరో పక్క ఈ చర్చ సందర్బంగా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ మధ్య చర్చ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది. చూసుకుందాం రా అంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఇరువురినీ శాంతింప చేసే పని చేసారు.

madnali 21012020 2

మరో పక్క ఉదయం నుంచి శాసనమండలిలో, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాసనమండలి చైర్మన్ షరీఫ్ తనదైన ముద్ర వేసి, నిబంధలకే జై కొట్టడంతో వికేంద్రీకరణ బిల్లు మండలిలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మండలిలో మెజారిటీ ఉన్న టిడిపి అకస్మాత్తుగా రూల్ 71ను తెరపైకి తీసుకురావడంతో వైసీపీ ఖంగుతినాల్సి వచ్చింది. ఫలితంగా సర్కారు తలపెట్టిన వికేంద్రకరణ బిల్లు వెనక్కివెళ్లే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వికేంద్రీకరణ బిల్లును నెగ్గించుకున్న వైసీపీ, మండలిలోనూ తన ఆధిపత్యం చూపించేందుకు చేసిన ప్రయత్నాలు ైచె ర్మన్ షరీఫ్ నిర్ణయం వల్ల నీరుగాయిపోయాయి. దీనితో మంత్రులు సహనం కోల్పోయి వారే చైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన అరుదైన దృశ్యాలకు మండలి వేదిక కావడం విశేషం.

madnali 21012020 3

మండలిలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురయింది. బిల్లుపై చర్చకు అనుమతిస్తే వ్యవహారం వైసీపీ సర్కారు చేతిలోకి వెళుతుందని, ముందే ఊహించిన టిడిపి పక్ష నేత యనమల రామకృష్ణుడు.. ఎవరూ ఊహించని రీతిలో రూల్ 71ను తెరపైకి తెచ్చారు. ముందుగానే రూల్ 71పై నోటీసు ఇవ్వడం, దానిని చైర్మన్ షరీఫ్ నిబంధనల ప్రకారం అనుమతించడం జరిగిపోయాయి. ఈవిధంగా రూల్ 71పై నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే, దీనిపై మంత్రులు బొత్స, బుగ్గన చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. చైర్మన్ రాజకీయ కోణంలో నిర్ణయాలు తీసుకోకూడదని, ఇలాగైతే ప్రభుత్వ నిర్ణయాలు ఆగిపోతాయని, అది మంచి సంప్రదాయం కాదని చైర్మన్ నిర్ణయాన్ని తప్పు పట్టే ప్రమయత్నం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read