ఆంధ్రర్పదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు సుప్రీం కోర్టులో కోరుకున్న రిలీఫ్ దొరకలేదు. కానీ ఒక చిన్న విషయంలో మాత్రం ఊరట లభించినా, దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఏసిబి చేస్తున్న దర్యాప్తును తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా, ఏసిబి విచారణ నిలిపివేస్తూ హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చిందో, ఆ ఆదేశాల పై స్టే ఇవ్వటానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపి హైకోర్టు ఏసిబి విచారణ పై ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో ఏపి హైకోర్టు రెండు ఆదేశాలు ఇచ్చింది. ఒకటి అమరావతి భూముల కొనుగోలు పై ఏసిబి చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఏసిబి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను బహిర్గతం చేయకుండా, మీడియాలో ప్రచురించకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ రెండు ఆదేశాలను సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఈ కేసు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏపి ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది రాజీవ్ దావన్ హాజరు అయ్యారు. అలాగే దమ్మాలపాటి తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్, హారీష్ సాల్వే హాజరు అయ్యి, తమ వాదనలు వినిపించారు. హారీష్ సాల్వే, ముకుల్ ఇద్దరూ గతంలో ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన వారు, ఈ సారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించటం విశేషం. అయితే ఈ రోజు వాదనలు వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. హైకోర్టు దర్యాప్తు ఎలా నిలిపివేస్తుంది అంటూ ప్రభుత్వం తరుపున రాజీవ్ ధావన్ వాదించారు. గత సంప్రదాయాలకు విరుద్ధం అని వాదించారు.

ఇక దమ్మాలపాటి తరుపున వాదించిన ముకుల్, ఇది కక్ష సాధింపు చర్య అని, గతంలో జగన్ కు వ్యతిరేకంగా వాదించారు, అందుకే కక్షతో ఈ కేసు నమోదు చేసారని వాదించారు. 30 ఏళ్ళ పాటు న్యాయవాది వృత్తిలో ఉన్న వారిని అపఖ్యాతి చేయటానికి, ఇతరులపై బురద చల్లటానికి దీన్ని వాడుకుంటున్నారని వాదించారు. సిబిఐకి ప్రభుత్వం లేఖ రాసినా పట్టించుకోలేదని గుర్తు చేసారు. కేసు ఫైల్ చేయక ముందే, ఐటి రిటర్న్స్ కోసం ఎందుకు ప్రభుత్వం పురమాయించిందని, ఇది కచ్చితంగా కక్ష సాధింపు అని అన్నారు. ఇక హరీష్ సాల్వే, ఇది హైకోర్టు మీద నో కాన్ఫిడెన్సు గా అభివర్ణించారు. ఇది హైకోర్టులో తేల్చుకోవాల్సిన అంశం అని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని అన్నారు. భుములు కొనటం తప్పు కాదని, పలానా చోటు ప్రాజెక్ట్ వస్తుంది అనేది అందరికీ తెలిసే విషయమే అని, తెలిసే భూములు కొంటారని అన్నారు. ఇరువరి వాదనలు విన్న కోర్టు గ్యాగ్ ఆర్డర్ పై మాత్రం స్టే విధిస్తూ, ఏసిబి విచారణ పై మాత్రం హైకోర్టు ఉత్తర్వుల పై ఎలాంటి స్టే ఇవ్వలేదు. జనవరి చివరికి ఈ కేసు వాయిదా వేసి, అప్పటి వరకు, ఎలాంటి విచారణ చేయవద్దని ఆదేశించింది. ఇక ఈ కేసులో ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గ్యాగ్ ఆర్డర్ పై స్టే ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏమి లేదు. ఇప్పటికే చేయాల్సిన అల్లరి అంతా ఈ కేసులో చేసారు. కాబట్టి, దీని వల్ల పెద్దగా ఏమి ఉండదు. ఏసిబి విచారణ పై హైకోర్టు ఇచ్చిన స్టే మాత్రం అలాగే ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read