అమరావతి భూములు అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దఖలు చేసినటువంటి పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటీషన్ ను, జస్టిస్ అశోక్ బూషన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, విచారణ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సహజంగానే ఈ మంత్రులు సబ్ కమిటీ, అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ, గతంలో సాక్షిలో వచ్చిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలు చెప్పింది. దీంతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ, అమరావతిలో అక్రమాలు జరిగాయని తేల్చటంతో, దీని పై రాష్ట్ర ప్రభుత్వం మరో సిట్ వేసింది. అయితే ఇది కావాలని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్న పనులు అని, ఒక్క ఆధారం కూడా చూపించకుండ, సిట్ వేసారని, కోర్టుకు వెళ్ళటంతో, హైకోర్టు క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ పై, అలాగే సిట్ పై స్టే వేధించింది. దీంతో హైకోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా రాకపోవటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్ళింది. దీని పై ఈ రోజు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

supremecourt 05112020 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వ హయంలో , అమరావతిలో జరిగిన వాటి పై ఒక క్యాబినెట్ సబ్ కమిటీ నియమించిందని, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఆరు నెలలు పాటు అనేక అంశాలు పరిశీలించి, అవకతవకలు జరిగాయని నిర్ధారించుకుని, ఆ అంశాల పై విచారణ చేయటానికి సిట్ ని ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు వాదనలు వినిపించింది. అసలు ఈ విషయానికి సంబంధం లేని వ్యక్తులు, సిట్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే, హైకోర్టు దాని పై స్టే విధించటం సరి కాదని, రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని, సుప్రీం కోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు, హైకోర్టు స్టే ఎత్తివేయటానికి ఒప్పోకోలేదు. ముందుగా ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చి, దీని పై వారి వాదన కూడా వింటామని, వారికి నోటీసులు ఇచ్చి, నాలుగు వారాలు సమయం కేటాయించి, అప్పటి లోగా అఫిడవిట్ దాఖలు చేయాలనీ, ఈ కేసుని నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు, ఇప్పటికిప్పుడు హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయటానికి ఒప్పోకోలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read