ప్రజా ప్రతినిధుల పై క్రిమినల్ కేసులకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలి అంటూ, అమికస్ క్యూరి హన్సారియ ఇచ్చినటు వంటి నివేదికల పైన ఈ రోజు, సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ జరిగింది. అమికస్ క్యూరి హన్సారియ ఇచ్చిన నివేదికలో, ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసుల విచారణ త్వరతిగతిన జరపించాల్సిన మార్గదర్శకాలు జారీ చేయాలి అంటూ, ఆయన సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసారు. దీని పై పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసులు ఏడాది లోపు విచారణ చేయాలని, 2015 నాటి సుప్రీం కోర్టు తీర్పు అమలు కాక పోవటాన్ని, బీజేపీ నేత అశ్వనీ కుమార్ ఉపాధ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దానికి సంబంధించి, ఈ కేసును జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సత్వర విచారణ పై, వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి కూడా, వివరాలు కోరుతూ నివేదిక కోరింది. ఆ నివేదిక వచ్చిన తరువాత, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు ఇచ్చిన నివేదికలు ఆధారంగా, అమికస్ క్యూరి సుప్రీం కోర్టుకు తాజాగా ఒక నివేదిక సమర్పించారు. ఇందులో ముఖ్యంగా తమిళనాడుకు సమర్పించి, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటు వంటి తీర్పులో, ప్రత్యేక కోర్టుల పై రాజ్యాంగా చెల్లుబాటుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు అనేక సందేహాలు వ్యక్తం చేసారు.

sc 04112020 2

దీంతో వీటి పై కూడా ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మద్రాస్ హైకోర్టు, నేరస్తుల ఆధారంగా కాకుండా, నేరాల ఆధారంగా ఈ ప్రత్యెక కోర్టులు ఉండాలంటూ వ్యాఖ్యానించటం సరి కాదు, దాన్ని సరిచేసుకోవాలని, రెండు వారాలు గడువు సుర్పీం కోర్టు ఇచ్చింది. ఈ రోజు ముఖ్యంగా ప్రత్యేక కోర్టులు, నోడల్ ఆఫీసర్ , జ్యుడీషియల్ ఆఫీసర్స్, సాక్షులకు రక్షణ, ప్రత్యెక కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ లాంటి మౌళిక సదుపాయాల ఏర్పాటు, వాటి అన్నిటి పై సిఫార్సు చేయగా, ఈ రోజు వీటి పై ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది. అలాగే కర్ణాటక, బెంగాల్ లో కేవలం ఒకే ప్రత్యేక కోర్ట్ ఉండటంతో, వాటిని పెంచే ఆదేశాలు కూడా ఇచ్చే అవకాసం ఉంది. ఇక ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటి అంటే, అధిక శిక్షపడే కేసులను ముందు విచారణ చేయాలనీ, సిట్టింగ్ ప్రజాప్రతినిధుల కేసులకు ప్రాధాన్యం ఇచ్చి, వారి సంగతి ముందు చూడాలని కోర్టుకు తెలిపారు. కోర్టు దీని పై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వాళ్ళు, అలాగే ఎక్కువ నేరారోపణ ఉన్న వాళ్ళ కేసులు ముందుగా విచారణ చేస్తారు. దీని పై ఈ రోజు కానీ, రేపు కానీ మార్గదర్శకాలు ఇచ్చే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read