ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అనుమతిస్తూ, రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీసుకున్న నిర్ణయాన్ని, సుప్రీం కోర్టులో నిన్న రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటీషన్ ఈ రోజు హియరింగ్ కి వస్తుందని అందరూ ఊహించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్ లో తప్పులు ఉండటంతో, సుప్రీం కోర్టు రిజిస్ట్రీ పిటీషన్ ను వెనక్కు పంపించారు. తప్పులు సరి చేసి, మళ్ళీ వేయమన్నారు. అయితే తప్పులు సరి చేసి వేసే లోపు, బెంచ్ టైం అయిపోవటంతో, ఇక ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చే అవకాసం లేదు. ఇప్పటికే ప్రభుత్వం, పిటీషన్ లో అర్జెంటు అని చెప్పినా, తప్పులు ఉండటం, అది సరి చేసే లోపు సమయం అయిపోవటంతో, ఇక ఈ పిటీషన్ మళ్ళీ సోమవారమే విచారణకు వచ్చే అవకాసం ఉంది. అయితే దీని పై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటీషన్ వేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకుంటే రేపటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఒక్కసారి ఈ ప్రక్రియ మొదలైతే, ఇక సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే అవకాసం ఉండక పోవచ్చని అంటున్నారు. సోమవారం ఈ పిటీషన్ విచారణకు వచ్చినా, ఇక ఎన్నికల ప్రక్రియ ఆపటం మాత్రం కుదరదు అని, న్యాయ కోవిదులు అంటున్నారు. మరో పక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ కేసులో ఒక కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్ గురించి వాదనలు వినే సమయంలో, తమ వాదన కూడా విని, నిర్ణయం ప్రకటించాలని కేవియట్ వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read