రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ కి రాజధాని తీసుకువెళ్ళే వ్యవహరం పై వేగంగా చర్యలు చేస్తుంటే, కోర్టులలో మాత్రం, ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మూడు ముక్కల రాజధాని పై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేసింది. 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ వికేంద్రీ కరణపై హైకోర్టు ఈ నెల 4న విచారణకు స్వీకరించింది. బిల్లుల అమలుపై యధాతథ స్థితిని కొనసాగించాలని ఈ నెల 14వ తేదీ వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్త ర్వులపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై సోమవారం ఈ రోజు విచారణ జరుగవలసి వుంది. అయితే కేసు విచారణకు రాకపోవడంతో అత్యవసర విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం మరో విజప్తి చేస్తూ, మరో పిటీషన్ వేసింది. అయితే పిటీషన్ తీసుకోకుండానే, సుప్రీం కోర్టు ఆ పిటీషన్ ను తిప్పి పంపించింది. ప్రభుత్వం వేసిన పిటీషన్ లో, తప్పులు తడకలు ఉన్నాయి అంటూ, సుప్రీం తిప్పి పంపించింది.

ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో కొన్ని తప్పులు ఎత్తి చూపుతూ, ఆర్డర్ కాపీ కూడా జతపరచలేదు అంటూ, అనేక లోపాలు ఉన్నాయని, సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అయితే ప్రభుత్వం ఎంత హడావిడిగా ఈ పిటీషన్ వెంటనే విచారణ జరపాలి అని తొందరలో ఉన్నా, ప్రభుత్వం తరుపు న్యాయవాదులు మాత్రం, తప్పులు తడకగా పిటీషన్ వెయ్యటంతో, ఈ పిటీషన్ సుప్రీం ముందుకు రావటానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాసం ఉంది. దీంతో, ప్రభుత్వం కూడా ఇక తొందరపడి అనవసరం అని, ఎలాగూ ఇది ఆ సమయానికి హైకోర్ట్ ముందుకు వస్తుందని, ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ తప్పులు సరి చేసి, ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేస్తుందా లేక, ఎలాగూ 14న హైకోర్టులో విచారణకు వస్తుంది కాబట్టి, వదిలేస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read