ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జడ్జిల పై, న్యాయస్థానాల పై టార్గెట్ అనే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే కొన్ని చర్యలు వీటికి బలం చేకూరుస్తూ ఉన్నాయి కానే, జస్టిస్ ఈశ్వరయ్య కేసు విషయంలో ఆడియో ఒకటి బయట పడటంతో సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం జడ్జి రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్య సంభాషణ ఒకటి బయట పడింది. అయితే ఈ ఆడియో నాది కాదని, అప్పట్లో జస్టిస్ ఈశ్వరయ్య ఖండించారు. అది ట్యాంపరింగ్ చేసారని అన్నారు. ఇది ఇలా ఉంటే, ఆ ఆడియోలో సుప్రీం కోర్టు జడ్జిలను టార్గెట్ చేసే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య మాటలు ఉన్నాయని, ఈశ్వరయ్య ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా పదవిలో ఉన్నారని, ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న కుట్ర అనే విధంగా హైకోర్టులో కేసు వేసి వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు దీని పై విచారణకు ఆదేశించింది. అయితే హైకోర్ట్ ఆదేశాల పై జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ రోజు ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‌ ఈశ్వరయ్య తరుపున ప్రశాంత్‌ భూషణ్‌, వ్యతిరేక వర్గంలో కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ముందుగా కపిల్‌ సిబల్‌ విచారణ ప్రారంభం కాగానే, తాను ఇప్పుడే మాట్లాడను అని అన్నారు. దీంతో ప్రశాంత్‌ భూషణ్‌ ని వాదనలు వినిపించమని సుప్రీం కోర్టు ఆదేశించింది.

eswaraiah 11012021 2

ఈ సందర్భంగా ప్రశాంత్‌ భూషణ్‌ వాదిస్తూ, అది ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రైవేటు సంభాషణ అని, దీంతో ఎలా ఎంక్వయిరీ వేస్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు జడ్జి మీద వాళ్ళు మాట్లాడుకున్నా, ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ క్రైమ్ ఎలా అవుతుంది అంటూ, ఆయాన వాదించారు. హైకోర్టు కనీసం తనకు చెప్పకుండా, విచారణకు ఎలా ఆదేశించిందని ప్రశ్నించారు. అందుకే ఈ కేసు పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే అప్పుడు కల్పించుకున్న కపిల్ సిబాల్, ఇది ప్రైవేటు సంభాషణగా వదిలేయటానికి లేదని, ఇది సిస్టం మీద కుట్ర పూరిత అటాక్ అని అన్నారు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న కోర్టు, ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా అని, ప్రశాంత్‌ భూషణ్‌ ని ప్రశ్నించింది. దానికి ప్రశాంత్‌ భూషణ్‌ ఒప్పుకుంటునే, సంభాషణలో బయట జరిగిన ప్రచారం మాత్రం వాస్తవం కాదని అన్నారు. అయితే మీరు సంభాషణ జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి, ఏమి సంభాషణ జరిగిందో అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అంటూ, ఈ కేసు పై స్టే ఇవ్వలేమని, కేసుని వచ్చే సోమవారానికి వాయిదా వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read