కేంద్రం అండ చూసుకునో, లేక కేంద్రంలో ఉన్న అధికారులను ఏమార్చవచ్చు అనో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వివాదాస్పదం అవుతున్నాయి. చట్టబద్ధత లేని నిర్ణయాలతో కోర్టులలో చీవాట్లు పడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు కోసం ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం అప్పులు చేస్తుంది, మద్యం ఆదాయం తాకట్టు పెడుతుంది, భూములు అమ్ముతుంది, భూములు తాకట్టు పెడుతుంది, ఇలా అనేక రూపాల్లో డబ్బులు కోసం నానా తిప్పలు పడుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యక విషయం ఏమిటి అంటే, కేవలం తను అనుకున్న నవరత్న పధకాలకు డబ్బులు ఇస్తే, దాని కోసం బటన్ నొక్కితే చాలు అనేది ఏపి ప్రభుత్వం వైఖరిగా కనిపిస్తుంది. అందు కోసం మిగతా అవసరాల కోసం ఉపయోగించాల్సిన డబ్బులు కూడా అక్కడ ఉపయోగించకుండా, ఇక్కడ పధకాల కోసం ఇచ్చేస్తే చాలు, ప్రజలు వాటికే సంతృప్తి చెందుతారు అనేది ప్రభుత్వ వైఖరిగా ఉంది. అందుకే రాష్ట్ర విపత్తు నిధుల నుంచి, డబ్బులు మళ్ళించింది. రాష్ట్ర విపత్తుల నిధిలో డబ్బులు ఉంటే, ఇప్పుడు వరదల సమయంలో ఎంతో ఉపయోగ పడేది. అలాంటి విపత్తుల నిధుల నుంచి డబ్బులు మళ్ళించింది.

sc 19072022 2

దాదపుగా రూ.1100 కోట్లను దారి మళ్ళించి, పీడీ ఖాతాలలో వేసుకుంది. అయితే ఈ డబ్బు కొవిడ్‌ బాధిత కుటుంబాలకు పరిహారంగా ఇవ్వాల్సిన డబ్బు. మన రాష్ట్రంలో అనేక మంది కోవిడ్ బారిన పడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కొకరికీ 50 వేలు ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి నుంచి ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అనూహ్యంగా మన రాష్ట్రంలో మాత్రం, ఒక్కరికి కూడా ఇవ్వకుండా, ఆ నిధులు దారి మళ్ళించారు. దీని పైన టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సుప్రీం కోర్టులో పిటీషన్ వేసారు. దీని పై విచారణ చేసిన సుప్రీం కోర్ట్, నిన్న ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ విషయం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులను రెండు వారాల్లో మళ్ళీ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి జమ చేయాలని, అలాగే అందరికీ కవిడ్ పరిహారం ఇవ్వాలని, ఎవరికైనా నిధులు రాలేదని ఫిర్యాదు వస్తే, నాలుగు వారాల్లో పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read