ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, క-రో-నాలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. చిన్న రాష్ట్రం అయినా, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో సిటీలు లేకపోయినా, అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఒక్కోటి అన్ లాక్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏది చేయకూడదో అదే చేసారు. స్కూల్స్ తెరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత నాలుగు రోజులుగా వస్తున్న సంఖ్య చూసి విశ్లేషకులు షాక్ అవుతున్నా, ప్రభుత్వం మాత్రం, ఇది కేవలం ఒక్క శాతం మాత్రమే కదా అంటుంది. అంతే కాదు, అవి అంతకు ముందు ఉన్న కేసులు, ఇప్పుడు వచ్చినవి కావు అంటుంది. అంతకు ముందు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వారు స్కూల్స్ కి వస్తుంటే, వేరే వారికి అంటుతుంది కదా ? గత నాలుగు రోజులుగా, 829 మంది ఉపాధ్యాయులు, 575 మంది పిల్లలు క-రో-నా బారిన పాడ్డారు. ఇంకా కొన్ని చోట్ల మధ్యన భోజనం వడ్డించే వారికి, వండే వారికి కూడా వైరస్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అధికారికంగానే ఇంత ఫిగర్ అంటే, అనధికారికంగా ఇంకా ఎక్కువ ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. దీనికి ఉదాహరణగా, విద్యాశాఖ విడుదల చేసే లెక్కలకు, క్షేత్రస్థాయిలో వచ్చే లెక్కలకు చాలా తేడా ఉందని చెప్తున్నారు. ఈ జిల్లా, ఆ జిల్లా అని లేకుండా, అన్ని జిల్లాల్లో ఈ సంఖ్య నమోదు అవుతుంది. ఈ రోజు ఈ సంఖ్య పెరిగే అవకాసం ఉంది.

ap 06112020 2

అయితే పిల్లల విషయంలో రిస్క్ వద్దని, వెంటనే స్కూల్స్ మూసేయాలని , వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విషయంలో కరోనా అని చెప్తున్న ప్రభుత్వం, ఇన్నాళ్ళు స్కూల్స్ లేకుండానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి అని ప్రశ్నిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవలేదని గుర్తు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్కూల్స్ కొనసాగుతాయి అనే విధంగానే స్పందిస్తున్నారు. విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే పెడుతున్నామని, ఇప్పుడు వచ్చేవి అన్నీ, ఇది వరుకే వైరస్ సోకిన వారని, ఇవి కూడా చాలా తక్కువ కేసులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ప్రభుత్వం అందరి దగ్గర ఒక ఫారం పై సంతకం చేపించుకుంటుంది. ఆ ఫారంలో, ఒక వేళ వైరస్ సోకినా మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఉంది. దీని పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా, ఇంత రిస్క్ అనుకున్నప్పుడు, ఎందుకు పిల్లల పై ఈ భారం అని వాపోతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు వెళ్ళేలా కనిపించటం లేదు. సెకండ్ వేవ్ వస్తే, పరిస్థితి చేయి దాటిపోతే, అప్పుడు మేల్కొని కూడా లాభం ఉండదని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read