రాష్ట్రంలో కో-వి-డ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదని, ఈరోజు ఉదయానికి ఏపీవ్యాప్తంగా 18లక్షల 09వేల 844కేసులు నమోదయ్యాయని, అధికారికంగా (ప్రభుత్వలెక్కలప్రకారం) మ-ర-ణిం-చి-న వారి సంఖ్య 11,940 ఉన్నాయని, వాస్తవంలో మాత్రం మ-ర-ణా-లు ఇంకా ఎక్కువే ఉంటాయని, నేటి ఉదయానికి యాక్టివ్ కేసులు 88,637ఉన్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... "రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ కో-వి-డ్ విషయంలో వాస్తవ విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. శ్మశానాల ముందున్న అంబులెన్సుల క్యూలను చూశాం. దహన సంస్కారాలకు చుట్టు పక్కలున్న ప్రాంతాల్లో ఖాళీలేక, ఇతర ప్రాంతాలకు మృతదేహాలను తీసుకెళ్లిన సందర్భాలు అనేకమున్నాయి. వాస్తవాలు అలా ఉంటే, ప్రభుత్వం మాత్రం రోజూ 70మంది, 80 మంది మ-ర-ణిం-చా-ర-ని అవాస్తవాలు చెబుతూ వచ్చింది. కానీ కేంద్రప్రభుత్వ డేటాకు చెందిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) గణాంకాలు చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి. స్క్రోల్ వెబ్ సైట్ వారు, నిన్న సీఆర్ ఎస్ డేటా ఆధారంగా కొన్ని వాస్తవాలు వెల్లడించారు. 2021 మే నెలలో రాష్ట్రంలో 400శాతం అధికంగా మ-ర-ణా-లు నమోదయ్యాయని సీఆర్ఎస్ డేటా చెబుతోంది. సాధారణంగా ఏటా మే నెలలో నమోదయ్యే మ-ర-ణా-ల కంటే, ఈ ఏడాది కో-వి-డ్ రెండో దశ కారణంగా మే లో 400 శాతం ఎక్కువగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఏ సంవత్సరం చూసినా సాధారణంగా, మే నెలలో రాష్ట్రంలో 27వేల మంది చనిపోతుంటారు. కానీ ఏ ఏడాది లక్షా30వేలమంది మరణించారు. సీఆర్ఎస్ డేటా ప్రకారం 2021 మే లో, రాష్ట్రంలో సాధారణంగా కంటే అదనంగా లక్షా03వేల745మంది మరణించారు. కానీ ప్రభుత్వం అధికారికంగా కోవిడ్ కారణంగా మరణించిన వారు కేవలం 2,938 మరణాలు మాత్రమేనని చెప్పింది. సీఆర్ఎస్ డేటా వాస్తవాలు ఒకవైపు, ప్రజలంతా కళ్లకుకట్టినట్టు చూసిన మరణాలు ఇంకోవైపు ఉండగా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారం చేసింది. అదే విధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్, మే నెలల్లో సాధారణంగా ప్రతి ఏటా నమోదయ్యే మరణాలకంటే కూడా, ఈ ఏడాది అధికంగా నమోదయ్యాయి. మే లో అదనంగా లక్షా03వేల745 మరణాలు నమోదైతే, ఏప్రియల్ లో 12,744, మార్చిలో 5,655 నమోదయ్యాయి. ఇంతపెద్ద ఎత్తున మరణాలు రాష్ట్రంలో సంభవిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం అత్యంత నీచంగా వాటిని తొక్కిపెట్టింది.

క-రో-నా సమయంలో ప్రజలకు అండగా ఉండటం కోసం, ప్రభుత్వంవాస్తవాలు తొక్కిపెడుతున్నందున తెలుగుదేశం పార్టీ మిస్ డ్ కాల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. 8144226661 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే, కో-వి-డ్ కారణంగా ఎవరైతే తమవారిని కోల్పోయారో, వారికి అండగా ఉండి, న్యాయంగా ప్రభుత్వం నుంచి దక్కాల్సినవి దక్కేలా చూస్తాం. 8144226661 నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే, ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లోని లింక్ ని ప్రెస్ చేస్తే, వాట్సాప్ ద్వారా వివరాలు పంపే ఫారమ్ ఉంటుంది. దానిలో మీయొక్క వివరాలు తెలియచేస్తే, ఆ వివరాలు టీడీపీకి అందిన వెంటనే, ప్రభుత్వం ద్వారా క-రో-నా బాధిత కుటుంబాలకు న్యాయంగా దక్కాల్సిన పరిహారం కోసం పోరాటం చేస్తాం. ప్రజల వివరాలు టీడీపీకి అందిన వెంటనే, వాటి ఆధారంగా ప్రభుత్వంపై పోరాడుతుంది. దయచేసి అందరూ ఈ అంశాన్ని గమనించాలని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ తనప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలు అవుతాయో, ఎక్కడ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సి వస్తుందోనన్న దుర్మార్గపు ఆలోచనతోనే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇలాచేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ తో చనిపోయిన వారంతా సహజంగా చనిపోయినట్టు రాసేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అలాచేస్తున్నారు. రుయాఘటనలో దాదాపు 30మందివరకు చనిపోతే, కేవలం 11 మందేనని చెప్పారు. సీఆర్ఎస్ సమాచారంతో మరణాలు లెక్కలు బట్టబయలయ్యాయి. ఇప్పడేం చెబుతాడు ఈముఖ్యమంత్రి? తన సొంతజేబులోని సొమ్మేదో ఇవ్వాల్సి వస్తుందన్న దుష్ట బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి ఇలా చివరకు మరణాల లెక్కను కూడా తక్కువచేసి చూపడానికి ప్రయత్నించి, ప్రజలను మోసగించాలనిచూస్తున్నాడు. గతసంవత్సరాలతో పోలిస్తే ఈ యేడాది మరణాలు అధికంగా నమోదైన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. లక్షలమంది అధికారికంగా చనిపోతుంటే, వాస్తవాలను ఎందుకు తొక్కిపెట్టారో వైద్యఆరోగ్యశాఖా మంత్రి సమాధానం చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read