ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపధ్యంలో, కొద్ది సేపటి క్రితం, తొమ్మిది మంది అధికారులను తప్పించాలని, చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు లేఖ రాసారు. ఇందులో ఇద్దరు ఐఏఎస్ లు, ఒక ఐపీఎస్ ఉన్నారు. గతంలో ఎన్నికల నిర్వహణ సమయంలో ఈ అధికారులు, విధులు సరిగ్గా చేయాటం లేదు అంటూ, వారి పై వేటు వేసారు. అయితే ఎన్నికలు ఆగిపోవటంతో, వీరి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎన్నికలు మొదలవ్వటంతో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలకు ఉపక్రమించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా అప్పట్లోనే వీరి పై ఎన్నికల కమీషనర్ చర్యలు తీసుకోవాలని, కోరారు. ఇప్పుడు మరోసారి వీరిని తొలగించాలని, వీరి స్థానంలో మూడేసి పేర్లతో తనకు ప్రతిపాదనలు పంపాలని, చీఫ్ సెక్రటరీకి, లేఖ రాసారు. ఈ తొమ్మిది మందిలో, గుంటూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మర్చార్ల సిఐ, పుంగనూరు సిఐ, తాడిపత్రి సిఐ, రాయదుర్గం సిఐల పై చర్యలు తీసుకోవాలని లేఖ రాసారు. వీరిని గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని లేఖ రాసారు.

sec 22012021 2

దీనికి సంబంధించి, ఒక్కో వ్యక్తి స్థానంలో ముగ్గురు పేర్లు తనకు వెంటనే పంపాలని కోరారు. దీనికి సంబంధించి, కొద్ది సేపటి క్రితమే దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ లేఖ పై చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరో పక్క కొద్ది సేపటి క్రితం జగన్ మోహన్ రెడ్డి దగ్గర, ఒక అర్జెంట్ కీలక సమావేశం జరుగుతుంది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఇందులో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎలక్షన్ కమీషనర్ దూకుడుకు ఎలా బ్రేక్ వేయాలి అనే అంశం పై చర్చిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఉదయం నుంచి రెండు సార్లు అప్పాయింట్మెంట్ ఇచ్చినా రాకపోవటం పై, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ద్వివేది, గిరిజా శంకర్లకు మేమో జారీ చేసారు, చర్యలు ఉంటాయని చెప్పటంతో, వాళ్ళు కొద్ది సేపటి క్రితమే, తాము వచ్చి కలుస్తాం అని చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read