ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు, రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో కానీ ప్రభుత్వం, ఎన్నికలు అంటేనే భయపడిపోతుంది. అమ్మో క-రో-నా అంటూ తప్పించుకుంటుంది. పుట్టిన రోజు వేడుకులు, అమ్మ ఒడిలు, గో పూజలు, ఇళ్ళ పట్టాలకు వేల మందిని పోగేస్తే రాని క-రో-నా, ఎన్నికలు పెడితే వచ్చేస్తుందని ప్రభుత్వం వాదిస్తుంది. అంతే కాదు, ప్రజలకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే, వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే ప్రజలకు వ్యాక్సిన్ వేయాలంటూ మరోసాకును ప్రభుత్వం చెప్తూ, ఎన్నికలు వాయిదా అంటుంది. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు అంటే సై అంటుంది, ప్రతిపక్షం వద్దు అంటుంది. మన రాష్ట్రంలో మాత్రం, ఎన్నికలు వద్దు అని చెప్పటానికి అధికార పక్షం సాకులు వెతుకుంటుంటే, ప్రతిపక్షం ఎన్నికలు కావాలి అంటుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యుల్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగల్ బెంచ్ కు వెళ్ళటం, అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చి, ఎన్నికల షెడ్యుల్ ని రద్దు చేయటం, వైసీపీ శ్రేణులకు కోర్టులు అంటే ఎంతో గౌరవం రావటం అన్నీ వెంట వంటనే జరిగిపోయాయి. అయితే సింగల్ బెంచ్ తీర్పు పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ కు వెళ్ళింది.

nimmagadda 15012021 2

రాష్ట్ర ఎన్నికల సంఘం పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, షెడ్యుల్ 23 నుంచి ఉంది కాబట్టి, ఈ కేసును 18కి రెగ్యులర్ బెంచ్ కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అయితే మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం, చేసుకోవాల్సిన పనులు చేసుకుంటూ పోతుంది. కీలకమైన మరో ముఖ్యమైన తుది ఎన్నికల జాబితాను ఎన్నికల సంఘం రెడీ చేసింది. ఇది రొటీన్ గా జరిగే కార్యక్రమం అయినా, 23 నుంచి షెడ్యుల్ ఉండటంతో, 18 తీర్పు తరువాత, అనుకూలంగా తీర్పు వస్తే, ఈ జాబితా రెడీగా ఉంటే, ఎన్నికల కమిషన్ కు పని తేలిక అయిపోతుంది. ఇక ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఎన్నికల జాబితా ప్రకారం, 2021 జనవరి 15 సమయానికి, రాష్ట్రంలో 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,99,66,737 పురుష ఓటర్లు కాగా, 2,04,71,506 మంది మహిళా ఓటర్లు. కొత్తగా 4,25,860 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. ఇప్పుడు ఎన్నికల తుది జాబితా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ చేయటంతో, ఇక అందరి చూపు 18న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు పైనే ఆధారపడి ఉంది. మరి కోర్టు ఏమి తీర్పు ఇస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read