రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‍ ప్రసాద్ లను బదిలీ చేసినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అధికారులను బదిలీ చేస్తున్నట్టు మీడియాకు చెప్పారు. అయితే అన్ని ప్రధాన చానల్స్ లో, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకు, ప్రభుత్వం వీరి ఇద్దరినీ బదిలీ చేసింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ అంశం పై మరో ట్విస్ట్ ఏర్పడింది. ప్రభుత్వం ఈ ఇరువురు అధికారుల పై చేసిన బదిలీ ప్రతిపాదనను, మేము తిరస్కరిస్తున్నామని, ఎలక్షన్ కమిషన్ కొద్ది సేపటి క్రితం ప్రభుత్వానికి సమాచారం పంపించింది. ఎన్నికల ప్రక్రియ కీలకంగా ఉన్న దశలో, కీలకమైన అధికారులను బదిలీ చేయటం కరెక్ట్ కాదని, ఎలక్షన్ కమిషన్ అభిప్రాయ పడింది. ఒక వేళ, ప్రభుత్వం ఎవర్ని అయినా బదిలీ చేయాలని అనుకుంటే మాత్రం, ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారమే బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అయితే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది కానీ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‍ ప్రసాద్ కానీ, 2021కి సంబంధించిన ఎన్నికల జాబితా ప్రచురించటంలో జాప్యం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

dwivivedi 26012021 2

విధి నిర్వహణలో అలసత్వం వహించారని, గతంలో మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సమయంలో, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ఇరువురి పై కూడా సరైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం వారిని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బదిలీ ఎన్నికల కమిషన్ సూచన మేరకు జరిగింది అంటూ నిన్న ప్రచారం జరిగింది. అయితే దీని పై ఈ రోజు ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, వీరి ఇరువురి బదిలీని తిరస్కరిస్తున్నామని చెప్పటంతో, ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. అయితే ఇదే సమయంలో ఎలక్షన్ కమిషన్ తన అధికారాలను, ప్రభుత్వానికి కూడా తెలియ చేసినట్టు అయ్యింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఈసి నిర్ణయం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు అని చెప్పినట్టు అయ్యింది. ఇక ఇప్పటికే ఎలక్షన్ కమీషనర్, తొమ్మిది మంది పై బదిలీ వేటు వేయాలని కోరగా, ఇప్పటి వరకు ప్రభుత్వం, ఆ విషయంలో ఎలాంటి ప్రక్రియ మొదలు పెట్టలేదు. దీని పై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read